Kajal Aggarwal Son Name : కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ బిడ్డ ఎలా ఉందో, తల్లిదండ్రులిద్దరిలో ఎవరి పోలికలతో ఉన్నాడో తెలుసుకోవాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. అంతేకాదు కుమారుడికి ఏ పేరు పెడతారు అని అందరూ ఎదురు చూస్తున్న క్రమంలో కాజల్ సోదరి బాబు పేరును రివీల్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. నిషా అగర్వాల్ కొత్త తల్లిదండ్రులను అభినందిస్తూ హృదయపూర్వక నోట్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్‌లో పసికందు పేరును వెల్లడించింది. నీల్ కిచ్లు అని నామకరణం చేసినట్టు తెలిపిన కాజల్ సోదరి.. ఆ చిన్నారి రాకతో మా ఇంట్లో ఆనందం రెట్టింపు అయిందని తెలియజేసింది.
నీల్ కిచ్లు మా ప్రపంచంలోకి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందంటూ నిషా అగర్వల్ స్పష్టం చేసింది. కాగా ప్రెగ్నెన్సీ సమయంలో కూడా కాజల్ చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆమె భర్త గౌతమ్ కిచ్లుపై కామెంట్స్ చేస్తూ పెట్టిన పోస్ట్ లు వైరల్‌గా మారాయి. ప్రెగ్నెన్సీ సమయంలో తనను గౌతమ్ ఎలా చూసుకుంటున్నాడనేది వివరంగా చెప్పింది కాజల్ అగర్వాల్.
తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని 2020 అక్టోబర్ లో కాజల్ అగర్వాల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. ముంబైలోని తాజ్ మహల్ ప్యాలస్ హోటల్ లో వీరి వివాహం జరిగింది. ఇక కాజల్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసింది. ఆమె నటించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. అయితే ఇటీవల విడుదలైన ఆచార్య సినిమా ట్రైలర్ మంచి రెస్సాన్‌ను సొంతం చేసుకొన్నది. కాజల్ కనిపించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. పూజా హెగ్డె కాస్తో కూస్తో ట్రైలర్ లో కనిపించింది. అయితే కాజల్ కనిపించకపోవడంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మరి సినిమాలో ఈమె పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…