KA Paul : కేఏ పాల్ గత ఎన్నికల సమయంలో ప్రజా శాంతి పార్టీ పేరుతో ఒక్కసారిగా రచ్చ చేశారు. ఎన్నికల తర్వాత కనుమరుగైన పాల్ తాజాగా ఏదో ఒక విషయం ద్వారా సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం తాను ప్రధానమంత్రి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదిలా ఉండగా తాజాగా పుష్ప సినిమా గురించి కేఏ పాల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పుష్ప సినిమా విడుదలై దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఈ సినిమాకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి. ఇప్పటికీ ఎంతో మంది ఈ సినిమాలో బాగా ఫేమస్ అయిన పాటలకు రీల్స్ చేయడం, అలాగే తగ్గేదే లే.. అని డైలాగులు చెబుతూ ఫేమస్ అయ్యారు. ఇప్పటి వరకు ఎంతో మంది క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు పుష్ప డైలాగులు చెబుతూ ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పుష్ప క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది.
తాజాగా కేఏ పాల్ కూడా తగ్గేదేలే.. అంటూ పుష్ప డైలాగ్స్ చెప్పడం సంచలనంగా మారింది. అయితే ఈ విషయంపై స్పందిస్తూ ఆ సినిమా ఏంటో.. ఆ యవ్వారం ఏందో నాకు తెలియదు. ఎవరో ముగ్గురు వచ్చి ప్రజాశాంతి పార్టీకి అభిమానులని ఈ డైలాగులు చెబితే పార్టీకి ఫండ్ ఇస్తామని చెప్పడంతో చెప్పాను. ఇంత వరకు అడ్రెస్ లేరంటూ పాల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఎవరో ఏంటో తెలియకుండా వారెవరో చెప్పమనగానే అలా డైలాగ్స్ చెప్పేయడమేనా.. వెర్రి బకరా.. అయ్యావుగా.. అని కొందరు నెటిజన్లు కేఏ పాల్‌పై కామెంట్లు చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…