Junior NTR : ప్రస్తుత తరుణంలో చాలా మంది గ్రామాల్లో ఫామ్ హౌస్‌లు నిర్మించుకుంటున్నారు. సంపన్నులు ఈ విధంగా చేస్తున్నారు. ఫామ్ హౌస్‌లు నిర్మించుకుని వాటిల్లో తోటలు పెంచుతున్నారు. ఈ క్రమంలో వారం మొత్తం పనిచేసి అలసిపోయిన వారు వీకెండ్స్‌లో ఫామ్ హౌస్‌లలో సేదతీరుతున్నారు. ఇక కొందరు అయితే కరోనా టైమ్‌లో పూర్తిగా ఫామ్ హౌస్ లలోనే గడిపారు. అయితే సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలా ఫామ్ హౌస్‌లను నిర్మించుకుంటున్నారు. వాటిల్లో వీకెండ్స్‌లో పార్టీలు జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ కూడా ఓ చోట ఫామ్ హౌస్‌ను నిర్మించారు.
హైదరాబాద్ కు సమీపంలోని శంకర్‌పల్లి అనే ప్రాంతంలో గోపాలపురం అనే గ్రామంలో తారక్ ఫామ్ హౌస్‌ను నిర్మించుకున్నాడు. అది ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. ఆ ఫామ్ హౌస్‌ను ఆయన తన భార్య లక్ష్మీప్రణతికి పుట్టినరోజు కానుకగా ఇచ్చారట. ఇక అందులోనే ఆమె బర్త్ డే వేడుకలను కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ ఫామ్ హౌస్‌కు ఎన్‌టీఆర్ తన సినిమా పేరునే పెట్టారు. అప్పట్లో వచ్చిన బృందావనం అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇదే సినిమా పేరును తన ఫామ్ హౌస్‌కు పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఫామ్ హౌస్‌కు చెందిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే తారక్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాలో భీమ్‌గా కనిపించి అలరించాడు. తరువాత ఆంజనేయ స్వామి మాలను ధరించాడు. అనంతరం విదేశాలకు వెకేషన్ కు వెళ్లి వచ్చాడు. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇది ఆగస్టులో ప్రారంభం అవుతుందని సమాచారం. అలాగే ఈ మూవీ అనంతరం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు. ఇలా వరుస మూవీలతో తారక్ బిజీగా మారనున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…