Junior NTR : నందమూరి తారక రామారావు.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పేరు వెనుక ఎంతటి చరిత్ర ఉందో అందరికీ తెలుసు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే సీఎం అయిన ఘనత సీనియర్ ఎన్టీఆర్‌ది. ఆయన సినిమాల ద్వారా కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఆయన సినిమాలు టీవీల్లో వస్తుంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తుంటారు. ఇక ఆయన మనవడిగా ఆయన పేరే పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తాత లాగే మనవడు కూడా సినిమాల్లో రాణిస్తూ అదరగొడుతున్నాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా ప్రేక్షకులను అలరించాడు. భీమ్ పాత్రలో జూనియర్ ఎన్‌టీఆర్ ఒదిగిపోయాడు. ఇదేకాదు.. తన సినిమా కెరీర్‌లో ఈయన ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు. అయితే పేర్లు ఒక్కటే అయినప్పటికీ సీనియర్, జూనియర్ ఎన్‌టీఆర్‌ల రుచులు మాత్రం వేరే. ఈ ఇద్దరూ భిన్న రకాల వంటకాలను ఇష్టపడతారు.
సీనియర్ ఎన్‌టీఆర్‌కు మాగాయ అంటే ప్రాణం. దాంతో ఆయన ఎంతైనా తినేవారు. ముఖ్యంగా తన సొంత గ్రామం నిమ్మకూరు నుంచి పంపించే మాగాయ అంటే సీనియర్ ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా తింటారు. షూటింగ్ సమయాల్లోనూ సెట్‌లో ఉన్నవారికి ప్రత్యేకంగా ఈ పచ్చడిని తెప్పించి భోజనం పెట్టించేవారట.
ఇక జూనియర్ ఎన్‌టీఆర్‌కు అయితే నాటుకోడి పులుసు, గారెలు అంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని ఎన్టీఆరే స్వయంగా ఓ కార్యక్రమంలో వెల్లడించారు. అప్పట్లో ఓ చానల్ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ ఎన్‌టీఆర్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. తనకు నాన్‌వెజ్ అంటే ఇష్టమని.. ఇంట్లో బిర్యానీని తాను పర్ఫెక్ట్‌గా వండుతానని కూడా చెప్పారు. అంతేకాదు.. బిగ్‌బాస్‌లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసినప్పుడు షో ముగింపు రోజుల్లో ఒక ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులకు స్వయంగా బిర్యానీ వండి కూడా పెట్టారు. ఇలా ఇద్దరు ఎన్టీఆర్‌లూ భోజన ప్రియులే. కానీ వీరు వేర్వేరు వంటలు అంటే ఇష్టపడేవారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…