Jiobook 4g : టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి వేదికైంది. ఇప్పటికే టెలికాం సేవల ద్వారా ఎన్నో లక్షల మంది వినియోగదారుల మన్ననలు పొందిన జియో మరో సంచలనాన్ని ప్రవేశపెట్టింది. కేవలం రూ.15వేలకే ఓ నూతన 4జి ల్యాప్‌టాప్‌ను జియో లాంచ్ చేసింది. దీన్ని ఇది వరకే ప్రకటించారు. ఇక ఇప్పుడు ఇది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. దీన్ని జియో ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు.
జియోబుక్ 4జి పేరిట రిలయన్స్ జియో ఓ నూతన ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఇందులో 4జి సేవలను పొందవచ్చు. ఆండ్రాయిడ్ ఆధారిత జియో ఓఎస్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 11.6 ఇంచుల డిస్‌ప్లే ఉంది. వైఫై, బ్లూటూత్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో 2 మెగాపిక్సల్ వెబ్ క్యామ్ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీంతో 8 గంటలకు పైగానే బ్యాకప్ వస్తుంది.
ఈ ల్యాప్‌టాప్‌లో 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే మైక్రోసాఫ్ట్ యాప్స్ వస్తాయి. ఆండ్రాయిడ్ యాప్స్‌ను కూడా వాడుకోవచ్చు. జియో బుక్ 4జి ల్యాప్‌టాప్ బ్లూ కలర్ ఆప్షన్‌లో మాత్రమే విడుదల కాగా దీని ధర రూ.15,799గా ఉంది. రిలయన్స్ డిజిటల్‌తోపాటు జియో ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ల్యాప్‌టాప్ ను కొనుగోలు చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…