Jio 5G Phone : దేశవ్యాప్తంగా ప్రస్తుతం టెలికాం కంపెనీలు వినియోగదారులకు 5జి సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. 5జి సేవలను అందించేందుకు అవసరమైన నెట్‌వర్క్‌లను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే దేశంలో టెలికాం కంపెనీలు 5జి సేవలను ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక రిలయన్స్ జియో ఈ విషయంలో కాస్త ముందే ఉందని చెప్పవచ్చు.
ఇప్పటికే అనేక నగరాల్లో జియో 5జి సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఈ ఏడాది చివరి వరకు 5జి సేవలను అందించడమే లక్ష్యంగా జియో పావులు కదుపుతోంది. అందుకు అవసరమైన నెట్‌వర్క్‌ను కూడా నిర్మించుకుంటోంది. దేశంలో మొదట 13 నగరాల్లో జియో తన 5జి సేవలను అందిస్తుందని తెలుస్తోంది. ఇక 5జి సేవలను ప్రారంభించడంతోపాటు అత్యంత చవక ధరకు ఓ ఫోన్‌ను జియో లాంచ్ చేస్తుందని కూడా సమాచారం అందుతోంది.
జియో లాంచ్ చేస్తుందని భావిస్తున్న 5జి ఫోన్ తాలూకు ఫీచర్ల వివరాలు ప్రస్తుతం నెట్‌లో లీకయ్యాయి. వాటి ప్రకారం.. జియో 5జి ఫోన్‌లో.. స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్, 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. తదితర ఫీచర్లు ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ను రూ.10వేల లోపు ధరకే అందించనున్నట్లు తెలుస్తోంది.
అయితే జియో లాంచ్ చేయనున్న 5జి ఫోన్‌కు చెందిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఈ ఏడాది చివరి వరకు ఒకేసారి 5జి సేవలను ప్రారంభించడంతోపాటు ఈ ఫోన్‌ను కూడా లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…