Jayasudha : తెలుగు సినీ ప్రేక్షకులు నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో చిత్రాల్లో నటించి సహజనటిగా పేరుగాంచారు. ఈమె ఇండస్ట్రీలో 50 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకున్నారు. ఇలా సుదీర్ఘ కెరీర్ ఉన్న నటి హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎవరూ లేరనే చెప్పాలి. అయితే తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక విషయాలను ఆమె పంచుకున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కే కార్యక్రమంలో పాల్గొన్న జయసుధ తన కెరీర్ కు చెందిన అనేక విషయాలను వెల్లడించారు.
50 ఏళ్లుగా హాలీవుడ్‌లో కనుక నటించి ఉంటే బొకెలు ఇచ్చి సన్మానాలు చేసేవారని.. కానీ తెలుగులో ఎవరూ పట్టించుకోవడం లేదని జయసుధ అన్నారు. ఇన్ని సినిమాలు తీసినా కనీసం పద్మశ్రీ దక్కలేదని జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జయసుధ తన కెరీర్‌ను బాలనటిగా ప్రారంభించింది. ఇప్పటికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అయితే తమకు అనుకూలంగా మాట్లాడుతుందని చెప్పి కంగనా రనౌత్‌కు పద్మశ్రీ ఇచ్చారని.. కానీ 50 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న తనకు కనీసం పద్మశ్రీ దక్కలేదని అన్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఇప్పటి వరకు తనను ఇండస్ట్రీలో ఉండనిచ్చేవారు కాదని జయసుధ అన్నారు. ముంబై నుంచి వస్తే నెత్తిన పెట్టుకుంటారని, వారి కుక్క పిల్లలకు కూడా రూమ్స్ ఇస్తారని, కానీ ఇక్కడి నటీనటులకు అంతగా ప్రాధాన్యతను ఇవ్వరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఆ గొడవలు భరించలేక అమెరికా వెళ్లానని.. ఎన్నికలు అయ్యాకే వచ్చానని తెలిపారు. అప్పట్లో శోభన్‌బాబు డబ్బులు పొదుపు చేసుకోమని, స్థలాలు కొనాలని అనేక సార్లు చెప్పారని, కానీ తాను వినిపించుకోలేదని.. సావిత్రిలా తాను కూడా ఎంతో డబ్బును పోగొట్టుకున్నానని జయసుధ తెలిపారు.
కాగా టాలీవుడ్ ఇండస్ట్రీపై జయసుధ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సినిమాలకు కలెక్షన్లు లేక ఇండస్ట్రీ పెద్దలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సమయంలో జయసుధ చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లు అవుతోంది. మరి ఆమె కామెంట్స్‌పై ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…