Jayalalitha : చూడడానికి చాలా చక్కగా కనిపించే సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత ఎక్కువగా వ్యాంప్ పాత్రలలో కనిపించేది. ఆ మధ్య మహేష్ బాబు నటించిన `భరత్ అనే నేను` చిత్రంలో స్పీకర్‌గా నటించి మెప్పించింది .దాదాపుగా 700కి పైగా చిత్రాలలో నటించిన ఆమె కమల్ హాసన్ సరసన ‘ఇంద్రుడు చంద్రుడు’ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం సినిమాల కన్నా సీరియల్స్‌లోనే ఆమె ఎక్కువగా కనిపిస్తోంది.
ప్రస్తుతం జయలలిత `ప్రేమ ఎంత మధురం` అనే సీరియల్‌లో నటిస్తోంది. ఇందులో ఆమె ఆర్య తల్లిగా శారదాదేవి పాత్రలో తన నటనతో మెప్పిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, తన మ్యారేజ్ లైఫ్ గురించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది. మలయాళంలో ఇండస్ట్రీలో తాను వ్యాంప్ పాత్రలతోనే పరిచయం అయ్యానని తెలిపింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి వినోద్ అలాంటి సినిమాలు తీసే వ్యక్తి అని పేర్కొంది.
వినోద్ వాళ్ల నాన్న ప్రముఖ నిర్మాత ఆళ్లపుర పురుషన్. వినోద్ బూతు సినిమాలతోపాటు భక్తిరస చిత్రాలు కూడా తీసేవారు. అదే సమయంలో డీ గ్రేడ్ సినిమాలు చేసేవారు. వాటిలో తానే హీరోయిన్ అని చెప్పింది. మేం ఇద్దరం కలిసి ఏడేళ్లు ప్రేమించుకున్నామని, ఏడేళ్ల ప్రేమ తర్వాత నాకు డౌట్ వచ్చింది. పెళ్లి చేసుకుందామని చాలా ఒత్తిడి తెచ్చాను. ఆయన విశ్వరూపం పెళ్లి చేసుకున్నాక తెలిసింది.
కేవలం అతనికి ఉన్న అప్పులు, తన ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత చిత్రహింసలు పెట్టాడని వెల్లడించింది. ప్రస్తుతం తన జీవితం హాయిగా ఉందని, ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నానని తెలియజేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…