Jathi Ratnalu : బుల్లితెర పాపులర్ యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు. తన అందంచందాలతోపాటు మాటలతోనూ తెగ సందడి చేస్తుంటుంది. ఛానల్‌తో సంబంధం లేకుండా ప్రతి చోట తెగ సందడి చేస్తుంటుంది. ఈ అమ్మడు చేసే రచ్చకు ప్రేక్షకులు ఊగిపోతుంటారు. తాజాగా ఈ అమ్మడు జాతిరత్నాలు అనే స్టాండప్ కామెడీ షోని హోస్ట్ చేస్తోంది. జబర్దస్త్ కామెడీ షోలో నవ్వులు వెల్లువిరుస్తాయి కానీ అంతకు మించిన బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఉంటాయి. అయితే జాతి రత్నాలు షోని అంతకు మించి అనేలా ప్లాన్ చేశారట.
ఈటీవీ ప్లస్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతున్న ఈ కామెడీ షోకి యాంకర్‌గా శ్రీముఖి చేస్తోంది. గతంలో పటాస్ షో మాదిరే ఉన్న ఈ స్టాండప్ కామెడీ షోలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ బ్యాచ్‌లతోపాటు కొంతమంది కొత్త కమెడియన్లు కనిపిస్తున్నారు. తాజాగా ప్రోమోలో జాతి రత్నాలు పేరుకి తగ్గట్టే ఇందులో చాలా జాతిరత్నాలు కనిపించాయి. అందర్నీ మించి శ్రీముఖి అయితే పెద్ద జాతి రత్నమే అనిపించింది. పాత పటాస్ షోని గుర్తు చేస్తూ రెచ్చిపోయింది శ్రీముఖి. ఇక వర్ష, ఇమ్మాన్యూల్ జంటగా కనిపిస్తే ఎలాంటి రచ్చ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తాజాగా జాతి రత్నాలు కామెడీ షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో వర్ష, ఇమ్మాన్యూల్ మధ్య జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. వర్ష ఇప్పటి కింకా నా వయసు నిండా పదహారే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది. వర్ష ఇమ్మాన్యూల్ కి సపోర్ట్ చేస్తున్నట్లు లేదు.. ఊరందరికీ సపోర్ట్ చేస్తున్నట్లు ఉంది అని శ్రీముఖి అనడంతో అంతా పగలబడి నవ్వారు. దీంతో ఇమ్మాన్యూల్ హర్ట్ అయ్యాడు. నీ వల్ల నన్ను అంతా సెకండ్ హ్యాండ్ గాడు అంటున్నారు అంటూ వాపోయాడు. ఇమ్మాన్యూల్ ఆవేదన నవ్వులు పూయించింది. మరో సాంగ్ లో వర్ష మరొకరితో డ్యాన్స్ చేస్తుంది. దీంతో ఇమ్మాన్యూల్ అసూయతో రగిలిపోతాడు. ఇంతలో నూకరాజు ఎంటర్ అవుతాడు.
చూసావా మావా వర్ష 5 వేల రూపాయల పూజ అంటే ఇలా ఉంటుంది. ఇంకో పదివేలు ఇస్తావా పెద్ద పూజ ప్లాన్ చేస్తాను అని అంటాడు. దీంతో ఇమ్మాన్యూల్ కల్పించుకుని.. అవసరం లేదు రెండు వేలు ఇవ్వు చాలు.. ఇదే చేస్తుంది పెద్ద పూజ అని అంటాడు. దీంతో అంతా పగలబడి నవ్వుతారు. అలాగే ఇతర కమెడియన్స్ శ్రీముఖిపై కూడా జోకులు వేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…