Janhvi Kapoor : శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌కు పరిచయం అయినప్పటికీ జాన్వీ కపూర్ మాత్రం నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఆమె నటించిన చిత్రాలు మరీ అంత పెద్ద హిట్ కాలేదు. కానీ నటనలో ఆమె మంచి మార్కులే కొట్టేసింది. ఇక జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ వెకేషన్స్‌కు వెళ్లే ఈమె తాను దిగే ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈమె బీచ్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను తాజాగా షేర్ చేసింది.
డెనిమ్ ప్యాంట్, వైట్ కలర్ టాప్ ధరించిన జాన్వీ బీచ్ ఒడ్డున విహరిస్తున్న ఫొటోలను షేర్ చేసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక జాన్వీ కపూర్ త్వరలోనే టాలీవుడ్ కు పరిచయం కానుంది. ఇన్ని రోజులూ ఈ విషయంపై అనేక వార్తలు పుకార్లుగా ప్రచారం అయ్యాయి. కానీ ఆమె తండ్రి బోనీ కపూర్ ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేశారు. జాన్వీ కపూర్ త్వరలోనే టాలీవుడ్‌కు పరిచయం అవుతుందని.. ఆమె ఎన్‌టీఆర్ సినిమాలో నటిస్తుందని చెప్పారు.
కాగా గతంలో ఒకసారి శ్రీదేవి ఓ తెలుగు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ అదే విషయాన్ని వెల్లడించింది. తన కుమార్తె జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలని ఉందని.. అయితే ఆమె తొలి తెలుగు మూవీని ఎన్‌టీఆర్‌తో చేయాలని ఆశిస్తున్నానని తెలియజేసింది. ఈ క్రమంలోనే ఆమె కోరినట్లుగానే జాన్వీ త్వరలో ఎన్‌టీఆర్ సినిమాలో నటించనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…