Jabardasth Varsha : బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె గతంలో మోడల్‌గా రాణించింది. అయినప్పటికీ జబర్దస్త్ షోకు వచ్చాకే ఈమెకు మరింత పాపులారిటీ పెరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం జబర్దస్త్ లో లేడీ కమెడియన్‌గా రాణిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈమె ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది.
హీరోయిన్లలాగానే జబర్దస్త్ వర్ష కూడా అప్పుడప్పుడు గ్లామర్ షో చేస్తుంటుంది. మతులు పోగొట్టే ఫోటోలను షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈమె ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వర్ష సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే అతని పరిస్థితి గురించి వర్ష పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం తన సోదరుడు కోలుకున్నాడని వర్ష సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. తన సోదరుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని చెబుతూ ఆ ఫొటోను కూడా జత చేసింది. ఈ సందర్భంగా వర్ష ఎమోషనల్ అయింది. సంక్రాంతి వేడుకల్లో సంతోషంగా ఉన్న తమ కుటుంబానికి ఈ ప్రమాదం వార్త పెద్ద షాక్‌ను ఇచ్చిందని ఆమె తెలియజేసింది. కాగా సోషల్ మీడియా వేదికగా వర్ష ఈ సందర్భంగా అందరికీ ఒక రిక్వెస్ట్ చేసింది.
దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా.. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ముగ్గురు వ్యక్తులు ట్రిపుల్ రైడింగ్‌తో నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే నా సోదరుడికి ప్రమాదం జరిగింది. హాస్పిటల్‌లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నాడు. మా ఫ్యామిలీ అంతా బాధపడ్డాం. ఎవరైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. ఎవరూ ఏ ఫ్యామిలీలోనూ బాధపడాల్సిన అవసరం రావొద్దు.. అని పోస్ట్ పెట్టింది వర్ష. కాగా వర్ష పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…