Jabardasth Show : బుల్లితెరపై ఎంతో సక్సెస్ సాధించిన షోలలో జబర్దస్త్ ఒకటి. జబర్దస్త్ షో వస్తుందంటే చాలు.. ఇంటిల్లిపాదీ ఒకప్పుడు ఎంతో ఇష్టంగా చూసేవారు. కానీ ఈ షోకు రాను రాను కళ తప్పింది. బూతును ప్రయోగించడమే పరమావధిగా మారింది. అయినప్పటికీ ఈ షోకు రేటింగ్స్ తగ్గలేదు. తరువాత ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను తీసుకొచ్చారు. ఒక షోకు అనసూయ, ఇంకో దానికి రష్మి గౌతమ్ యాంకర్లుగా చేస్తున్నారు. తరువాత జడ్జిగా నాగబాబు దూరమయ్యారు. కొంత కాలానికి రోజా కూడా దూరమయ్యారు. ఇప్పుడు కమెడియన్లు కూడా దూరమవుతున్నారు. దీంతో జబర్దస్త్ షో ఉనికికే ప్రమాదం ఏర్పడింది.
స్టార్ కమెడియన్లు అందరూ ప్రస్తుతం ఇతర టీవీలలో వచ్చే షోలలో కనిపిస్తున్నారు. అందరూ జబర్దస్త్‌లో పనిచేసేందుకు ఇష్టపడడం లేదని తెలిసింది. ఈ క్రమంలోనే సుధీర్, శ్రీను, ఆది వంటి వారు ఈ షోకు దూరమయ్యారు. త్వరలోనే రెండు షోలను తీసేసి ఒక షోనే ఉంచుతారని.. దానికి రష్మిని యాంకర్‌గా చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ షో ఇక నిలిచిపోతుందనే వార్తలను ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై నిర్వాహకులు మల్లెమాల సంస్థ వారు స్పందించారు.
జబర్దస్త్ షో నిలిచిపోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎంతో మంది కమెడియన్లు వస్తుంటారు.. పోతుంటారు.. కొత్తవారితో అయినా సరే ఈ షోను నడిపిస్తాం. కానీ ఆపే ప్రసక్తే లేదు. ఈ షో ను ఆపేస్తున్నామని వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరారు. కాగా జబర్దస్త్ షోకు ఈ మధ్య కాలంలో రేటింగ్స్ కూడా బాగా తగ్గాయి. దీంతో చీప్ ట్రిక్స్ ప్లే చేసి రేటింగ్స్ రాబట్టాలని చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇంత చేసినప్పటికీ ఈ షోకు ప్రస్తుతం కళ తప్పిందనే చెప్పవచ్చు. అసలే స్టార్ కమెడియన్లు దూరమై కష్టాల్లో ఉన్న జబర్దస్త్ మళ్లీ తిరిగి పూర్వ స్థితిని సొంతం చేసుకోవాలంటే.. కొంత కాలం వేచి చూడక తప్పదు. అప్పటి వరకు ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…