Anchor Suma : సుమ వ్యాఖ్యాతగా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ విశేషమైన ప్రేక్షకాదరణ పొందాయి. ఈ క్రమంలోనే శనివారం సుమ క్యాష్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తుంటుంది. ఇక ఈ శనివారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్స్ హాజరైనట్లు తెలుస్తోంది. కాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది వైరల్ గా మారింది.
ఇక ఎప్పటిలాగే తనదైన శైలిలో జబర్దస్త్ కమెడియన్స్ పై సుమ పంచులు వేస్తూ ప్రేక్షకులను సందడి చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన పొట్టి నరేష్ సుమ దగ్గరకు వెళ్లి మిమ్మల్ని చూడగానే నా మనసులో ఏదో అవుద్ది అంటూ సుమకు గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అయితే మొదటగా గులాబీ పువ్వు తీసుకున్న సుమ ఆపై పొట్టి నరేష్ ప్రపోజల్ కి రియాక్ట్ అవుతూ తనదైన శైలిలో పంచ్ వేసింది.
గులాబీ పువ్వు చేతిలోకి తీసుకున్న సుమ.. పోరా జఫ్ఫా.. మా ఆయన చూస్తే నిన్ను ఇక్కడే పాతిపెట్టి నీకు సమాధి కట్టి నీ సమాధిపై రోజా పువ్వు పెడతాడు.. అంటూ తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ పంచ్ వేసింది. అయితే పొట్టి నరేష్ తర్వాత స్టేజ్ పై నుంచి కిందపడడం.. ఆంబులెన్స్ రావడం.. వంటి సీన్లతో ఈ ప్రోమో కట్ చేశారు. నిజంగానే పొట్టి నరేష్ కిందపడిపోయాడా.. లేకపోతే ప్రోమోలో భాగంగా ఇలా చేశారా.. అనే విషయం తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…