Isha Koppikar : ప్రస్తుతకాలంలో చిత్ర పరిశ్రమ ఏదైనా సరే క్యాస్టింగ్ కౌచ్ అన్నది కామన్ విషయం అయిపోయింది. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నా అది కేవలం నాలుగు గోడలకు మాత్రమే పరిమితమై ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని చెప్పవచ్చు. మీ టూ ఉద్యమాలు వెలుగులోకి రావడంతో ఎవ్వరూ కూడా వెనక్కు తగ్గడం లేదు. ఇక ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద ఉద్యమంగా మారిపోయింది.
ఎక్కువగా ఆఫర్లు రాని చిన్నా చితకా హీరోయిన్లు మాత్రమే కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం అనే చెప్పాలి. ఒకప్పటి అగ్ర స్థాయి హీరోయిన్ల నుంచి ఇప్పటి అందాల తారల వరకూ కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే ఆ లిస్ట్ లో నేను కూడా ఒకరిని అని హీరోయిన్ ఈషా కొప్పికర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈషా కొప్పికర్ 1998లో ఎక్ థా దిల్ థా ధడ్కన్ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యింది. అదే సంవత్సరంలో చంద్రలేఖ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ నటించిన ప్రేమతో రా చిత్రంలో కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. తన అందం అభినయంతో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపుతోపాటు ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది. ఆ ఇంటర్వ్యూలో తాను చదువుకునే రోజుల్లో పాకెట్ మనీ కోసం తాను మోడలింగ్ చేశానని ఇషా వెల్లడించడం జరిగింది. మోడలింగ్ చేసే టైంలోనే నాకు సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఎక్ థా దిల్ థా ధడ్కన్ అనే సినిమాలో అవకాశం రాగా అందులో నటించానని చెప్పకొచ్చింది.
ఈ సినిమాలో నటించిన తర్వాత ఓ నిర్మాత ఫోన్ చేసి ఒక అవకాశం ఉంది అని చెప్పారు. అయితే ముందుగా హీరోను కలవాలి అని కండిషన్ పెట్టారని తెలిపింది. ఆ తరవాత తాను హీరోకు ఫోన్ చేయగా మీరు మాత్రమే ఒంటరిగా రండి. మీతో ఎవరినీ తీసుకుని రావద్దు. ఏకాంతంగా కలుద్దాం అంటూ పచ్చిగా మాట్లాడాడు అని ఆవేదన వ్యక్తం చేసింది ఈషా.
ఈ సంఘటనతో నేను వెంటనే సదరు నిర్మాతకు ఫోన్ చేసి నేను టాలెంట్ ను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చా అని చెప్పానని తెలిపింది. నా టాలెంట్ కు అవకాశాలు వస్తే సినిమాలు చేస్తా లేదంటే లేదు అని మొహమాటం లేకుండా చెప్పేశాను. ఆ తరవాత ఆ ప్రాజెక్ట్ నుండి నన్ను తొలగించారు అని తెలిపింది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లుగా రాణించడానికి రాజీ పడుతున్నారని కూడా చెప్పింది. ఇంతకూ తనను ఇబ్బంది పెట్టిన ఆ హీరో, నిర్మాత ఎవరు అనే విషయం మాత్రం బయటకు చెప్పలేదు. మరలా ఈషా 2017లో కేశవ చిత్రంతో తెలుగు తెరపై తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుత ఈషా హిందీ, తమిళ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…