KGF : కన్నడ సినిమా కేజీఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా 2018 డిసెంబర్ 21వ తేదీన విడుదలై సంచలనాలను సృష్టించింది. కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే రూ.80 కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.250 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2ను ఈ నెల 14వ తేదీన చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
అయితే కేఎజీఎఫ్ సినిమాను చూశాక.. అది రియల్ స్టోరీనా ? నిజంగానే అలా జరిగిందా ? అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరికీ ఈ డౌట్ రావడం సహజమే. ఎందుకంటే ఈ సినిమాకు వాడిన టైటిల్.. కేజీఎఫ్.. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్.. కర్ణాటకలో ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఈ గనులను మూసివేశారు. వాటిలో బంగారాన్ని వెలికి తీసేందుకు చాలా ఖర్చవుతుందని.. వచ్చే బంగారం ఖరీదు కన్నా.. దాన్ని వెలికి తీసేందుకే ఎక్కువ ఖర్చు అవుతుందని.. కనుక గనులను మూసివేస్తున్నామని ఎప్పుడో చెప్పేశారు. ఆ ఫలితంగా ఆ గనులు మూతపడ్డాయి. అయితే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కు షార్ట్ కట్ కేజీఎఫ్ కనుక.. ఈ సినిమా స్టోరీ కూడా రియల్ లైఫ్ స్టోరీ అని భావించారు. కానీ ఈ స్టోరీ రియల్ కాదు.
అయితే కేజీఎఫ్ లాగే అప్పట్లో బంగారు గనుల్లో ప్రజలు మగ్గిపోయేవారు. కనుక ఈ సినిమాను యదార్థ సంఘటనల ఆధారంగా ఓ కల్పిత కథను సృష్టించి తీశారని చెప్పవచ్చు. అలాంటి సంఘటనలు అప్పట్లో జరిగాయి. కానీ కేజీఎఫ్ స్టోరీ మాత్రం రియల్ కాదు. ఇది పూర్తిగా కల్పితమే. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పేశారు. కానీ ఈ మూవీ స్టోరీని ఇప్పటికీ ఇంకా చాలా మంది రియల్ అనే అనుకుంటున్నారు. ఇదీ అసలు విషయం.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…