iPhone 14 : టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఈ మధ్యే ఐఫోన్ 14 సిరీస్‌లో 4 నూతన ఫోన్లను లాంచ్ చేసిన విషయం విదితమే. ఐఫోన్ 14, 14 ప్లస్, 14 ప్రొ, 14 ప్రొ మ్యాక్స్ పేరిట ఈ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. వీటికి గాను సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రీ ఆర్డర్స్‌ను ప్రారంభించారు. అయితే శుక్రవారం నుంచి ఈ ఫోన్స్‌కు గాను సేల్స్ ప్రారంభం అయ్యాయి. ఇక ఈ ఫోన్లు ప్రస్తుతం భారత్‌లోనూ లభిస్తున్నాయి. అయితే ఐఫోన్ 14 ప్లస్ ఫోన్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 7 నుంచి అందుబాటులోకి రానుంది. మిగిలిన ఫోన్లను ప్రస్తుతం వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.
ఇక ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ.79,900 ఉండగా.. ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900 గా ఉంది. అలాగే ఐఫోన్ 14 ప్రొ ప్రారంభ ధర రూ.1,29,900 కాగా, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,39,900 గా ఉంది. మిడ్‌నైట్, బ్లూ, స్టార్‌లైట్, పర్పుల్, ప్రొడక్ట్ రెడ్ కలర్, డీప్ పర్పుల్ తదితర కలర్స్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లలో యూజర్లకు అధునాతన ఐఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది.
కొత్త ఐఫోన్లలో ఎమర్జెన్సీ శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌తోపాటు కార్ క్రాష్ డిటెక్షన్ అనే ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. ఐఫోన్ 14, 14 ప్లస్ ఫోన్లు 128, 256, 512 జీబీ వేరియెంట్లలో లభిస్తుండగా.. ఐఫోన్ 14 ప్రొ, 14 ప్రొ మ్యాక్స్ ఫోన్లు 128, 256, 512జీబీతోపాటు 1టీబీ వేరియెంట్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇక ఐఫోన్ 14 ఫోన్లను కొనేవారికి ఆకర్షణీయమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొంటే రూ.6,000 వరకు అంటే.. 5 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్లపై 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అదే పాత ఐఫోన్ మోడల్స్ ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే గరిష్టంగా రూ.58,730 వరకు తగ్గింపు పొందొచ్చు. దీంతో ఫోన్ ధర బాగా తగ్గుతుంది. ఇలా ఎక్స్‌ఛేంజ్ చేస్తే ఐఫోన్ 14 బేస్ మోడల్‌ను రూ.21వేలకే పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…