ప్రస్తుతం కరోనా సంక్షోభంలో చిక్కుకున్న భారత దేశాన్ని కాపాడటం కోసం అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో భారతదేశాన్ని ఆదుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన కొద్ది రోజులలోనే భారత్ కి పెద్ద సహాయం చేశారు. ప్రస్తుతం కరోనా చికిత్సలో ఎంతో అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, ఎన్-95 మాస్కులు, ర్యాపిడ్ టెస్టు కిట్లు పంపిణీ చేయటానికి యూఎస్‌ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవెలప్‌మెంట్(యూఎస్ఏఐడీ) సిద్ధం చేసింది.
అమెరికా సహాయంలో భాగంగా పది లక్షల రాపిడ్ టెస్ట్ డయాగ్నస్టిక్ టెస్టు కిట్లు పంపనున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఈ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా.. కేవలం 15 నిమిషాలలో ఎంతో స్పష్టమైన ఫలితాలు వెలువడ్డాయి. ఈ కిట్ల ప్రత్యేకత అదే . గత ఏడు సంవత్సరాల నుంచి భారత్ అమెరికా మధ్య సన్నిహిత సంబంధం ఉందని ఈ కోవిడ్ కష్టకాలంలో ఆ బంధం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు తెలిపాడు.
కరోనా మొదటి దశలో భారత్ నుంచి అమెరికా ఎంతో సహాయం పొందిందని,ఇప్పుడు ఇండియాకి కూడా సహాయం అవసరం కనుక తమ దేశం నుంచి ఇప్పటికే 23 మిలియన్ డాలర్ల సాయం చేసిందని, మరో 100 మిలియన్ డాలర్ల విలువైన వైద్య పరికరాలను అందజేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు.
భారత్‌కి 1100 ఆక్సిజన్ సిలిండర్లు, 1700 మెడికల్ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, ఒక్కోటి 20 మందికి ఉపయోగపడే ఆక్సిజన్ యూనిట్లు అందించనున్నట్లు తెలిపారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…