కరోనా సెకండ్ వేవ్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది వైరస్ బారిన పడే చనిపోతుండగా మరి కొందరు భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఈ విధంగా కరోనా సోకి మృతి చెందిన వారికి దహన సంస్కరణలు నిర్వహించడానికి కూడా కుటుంబసభ్యులు ముందుకు రావడం లేదు. మరికొందరు తమ కుటుంబ సభ్యులను కడసారి చూడలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌లోని కరోనాతో చనిపోయిన తండ్రి దహన సంస్కారాలు నిర్వహిస్తుండగా తన తండ్రి మరణం తట్టుకోలేక ఆ కూతురు చితి మంటల్లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
రాజస్థాన్‌లోని రాయ్ కాలనీకి చెందిన దామోదర్ దాస్ అనే వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే అతని పరిస్థితి విషమించడంతో దామోదర్ దాస్ మరణించాడు. ఈ క్రమంలోనే అతని మృతదేహానికి పంచాయతీ సిబ్బంది, తమ కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ క్రమంలోనే దామోదర్ దాస్ చితికి నిప్పటించిన వెంటనే అతడి కుమార్తె శారద చితిపైకి దూకేసింది. ఈ ఘటనతో అక్కడున్న వారందరూ ఎంతో షాక్ కి గురయ్యారు. ఒక్క నిమిషం ఈ షాక్ నుంచి తేరుకొని హుటాహుటిన శారదను ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…