కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. దేశంలో అందరికీ కోవిడ్ టీకాలను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ కేంద్రమే ఉచితంగా కోవిడ్ టీకాలను అందిస్తుందని, కోవిడ్ టీకాల కోసం రాష్ట్రాలు పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదని మోదీ అన్నారు.
కరోనా నేపథ్యంలో సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. కేంద్రమే టీకాలను కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తుందని, టీకాల కోసం ఎవరూ ఖర్చు చేయాల్సిన పనిలేదన్నారు. దేశ ప్రజలందరికీ టీకాలు వేసే బాధ్యత కేంద్రానిదే అని అన్నారు.
నవంబర్ వరకు దేశంలోని 80 కోట్ల మందికి టీకాలు వేస్తామని మోదీ అన్నారు. కోవిడ్ టీకాల పట్ల ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయని, టీకాలు తీసుకునేందుకు ఎవరూ భయ పడాల్సిన పనిలేదని అన్నారు. ప్రతి ఒక్కరూ టీకాను తీసుకోవాలన్నారు. టీకాలపై ఇతరులకు ఉండే అపోహలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కోవిడ్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాపై చేస్తున్న పోరాటంలో అందరం విజయం సాధిస్తామని, భారత్ కోవిడ్ పై విజయం సాధిస్తుందని అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…