గత కొద్ది రోజుల వరకు చికెన్ ధర మార్కెట్‌లో కేజీకి రూ.270 వరకు పలికిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కిలో రూ.170కి అమ్ముతున్నారు. అనేక రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్‌లు, లాక్‌డౌన్‌లు విధించడం, వాణిజ్య పరమైన వినియోగం తగ్గడం, రాత్రి కర్ఫ్యూలు వంటి అనేక కారణాల వల్ల చికెన్ ధరలు భారీగా తగ్గాయి.
గతేడాది కరోనా ప్రభావం మొదలయ్యాక చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. కానీ తరువాత చికెన్ తినడం వల్ల కరోనా రాదని, పైగా చికెన్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పడంతో ప్రజలు చికెన్ బాగా తినడం మొదలు పెట్టారు. అయితే అప్పటి నుంచి చికెన్ ధరలు కొద్దిగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చాయి. కానీ ప్రస్తుతం ధరలు మళ్లీ పడిపోయాయి.
కరోనా వల్ల చాలా చోట్ల ఆంక్షలను విధించారు. ఫంక్షన్లు, సభలు, సమావేశాలు జరగడం లేదు. హోటళ్లు, రెస్టారెంట్లలోనూ వినియోగం తగ్గింది. దీంతో డిమాండ్ 30 శాతం వరకు తగ్గినట్లు తెలుస్తోంది. అందువల్లే చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఇక మరోవైపు వేసవిలో కోడిపిల్లలను కాపాడడం కూడా పౌల్ట్రీ రైతులకు కష్టంగా మారింది. సాధారణంగా ఒక కోడికి రూ.90 వరకు ఖర్చు పెట్టాలి. కానీ ప్రస్తుతం కిలో బరువున్న కోడిని రూ.66కే విక్రయించాల్సి వస్తోంది. దీంతో పౌల్ట్రీ రైతులు భారీ నష్టాలను చవి చూస్తున్నారు.
అయితే బ్రాయిలర్ కోళ్ల ధరలు పడిపోతున్నప్పటికీ మరోవైపు నాటుకోళ్లు, మటన్‌లకు గిరాకీ తగ్గలేదు. ఇంకా పెరిగింది. దీంతో వాటి ధరలు పైపైకి వెళ్తున్నాయి. నాటుకోడి కేజీ ధర రూ.400 వరకు పలుకుతోంది. కడక్‌నాథ్ కోడి మాంసం అయితే కేజీకి రూ.500 పైగానే పలుకుతోంది. ఇక మటన్ ధర రూ.800 వరకు ఉంది. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ వైపు రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. అదే జరిగితే పౌల్ట్రీ రైతులకు ఇంకా భారీ నష్టాలు తప్పవనే తెలుస్తోంది. కరోనా ప్రభావం తగ్గి వ్యాపారాలు మళ్లీ పుంజుకుంటేనే గానీ కోళ్ల ధరలు పెరిగే అవకాశం లేదు. అప్పటి వరకు వేచి చూడాల్సిందేనని పౌల్ట్రీ రైతులు అంటున్నారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…