Pawan Kalyan : పవన్ కల్యాణ్ అనేక రోజుల పాటు రాజకీయాల్లో ఉంటూ ఆ తరువాత చేసిన సినిమా భీమ్లా నాయక్. ఈ మూవీ ఎప్పుడో విడుదల కావల్సి ఉన్నా.. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ మూవీ విడుదలై ఘన విజయం సాధించింది. మళయాళ రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగినట్లు ఈ మూవీని తెరకెక్కించారు. దీంతో సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక పవన్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెర మీదకు వచ్చింది. అదేమిటంటే..
మళయాళంలో ఇటీవలే రిలీజ్ అయిన జనగణమన అనే మూవీ జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తోంది. ఇందులో రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం యువతను ఎలా రెచ్చగొడతారు.. సమాజాన్ని ఎలా తప్పుదోవ పట్టిస్తారు.. అనే విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇందులో మళయాళ నటుడు పృథ్వీరాజ్ నటించగా.. మమతా మోహన్ దాస్ ఇంకో కీలక పాత్రలో నటించింది. అయితే ఈ మూవీ ఓటీటీలోకి కూడా వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో దాదాపు అన్ని భాషల్లోనూ ఈ మూవీని స్ట్రీమ్ చేస్తున్నారు. అయితే ఇదే మూవీని పవన్ చేస్తే బాగుంటుందని అంటున్నారు.
జనగణమన సినిమాలో పృథ్వీరాజ్ లాయర్‌గా నటించారు. కనుక పవన్ కూడా లాయర్‌గా చేస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సమాజంలో రాజకీయ పరిస్థితులు అలాగే ఉన్నాయని.. అసలు సమస్యల గురించి ప్రజలు ఆలోచించకుండా ఉండేందుకు నేతలు తప్పుదారి పట్టించేలా ప్రయత్నిస్తున్నారని.. కనుక పవన్ ఈ మూవీని చేస్తే అలాంటి వారికి చెంప పెట్టులా ఉంటుందని అంటున్నారు. అయితే పవన్ విశ్లేషకుల మాటలను పరిగణనలోకి తీసుకుంటారా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…