Hyper Aadi : మల్లెమాల సంస్థ నిర్వహించే జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది నూతన కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకమైన పంచ్ డైలాగులతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ ఎంతో మంది కమెడియన్స్ కి జీవితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, శ్రీను, చలాకి చంటి, షేకింగ్ శేషు లాంటి వారు సెలబ్రిటీలుగా మారిపోయారు. ఈ కోవకు చెందినవాడే హైపర్ ఆది.
సరైన టైమింగ్ లో పంచ్ డైలాగులు వేస్తూ ఆది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో హైపర్ ఆది కన్నీళ్లు పెట్టుకున్నట్లు ప్రోమో ఒకటి విడుదలైంది. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ రష్మీ గౌతమ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఈ షోలో హైపర్ ఆది, ఇమాన్యుయేల్, ఆటో రాంప్రసాద్ వంటి వారు తమ స్కిట్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ఈ షో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజాదరణ పొందింది.
అసలు విషయానికి వెళ్తే తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ షో మాదిరిగా ఒక టేబుల్ పై కంటెస్టెంట్స్ ఫోటోలు పెట్టారు. యాంకర్ రష్మి తమకు నచ్చని వారి ఫోటోలను కాల్చేయడం లేదా చింపేయడం చేయడం లాంటివి చేయాలి అంటూ చెప్పింది. ముందుగా ఆటో రాంప్రసాద్ టేబుల్ వద్దకు ఎంట్రీ ఇచ్చి హైపర్ ఆది వలన నేను ఒక విషయంలో పర్సనల్ గా హర్ట్ అయ్యాను, సారీ ఆది అంటూ రాంప్రసాద్ ఆది ఫోటోను కాల్చేస్తాడు.
ఆ తర్వాత పరదేశి వచ్చి నాకు అన్నీ హైపర్ ఆది అని చెబుతాను కానీ ఒక రీజన్ వలన ఇలా చేయవలసి వస్తోంది అంటూ ఆది ఫోటోను చింపేస్తాడు. ఇక రష్మీ కూడా హైపర్ ఆది ఫోటో సెలెక్ట్ చేసుకుని ఫోటోను చింపేస్తుంది. నేను ఫస్ట్ ఎపిసోడ్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆది.. రష్మీ ఎప్పుడు వచ్చావు అని అడగకుండా, ఎప్పుడు వెళ్తావు అని అడిగాడు. నాకు ఈ విషయం నచ్చలేదు అంటూ రష్మీ చెప్పుకొచ్చింది. దీంతో ఆది కంటతడి పెట్టుకుంటాడు.
ఈ ప్రోమో లో హైపర్ ఆది టేబుల్ వద్దకు ఎంట్రీ ఇచ్చి ఒకరి ఫోటోని చేత్తో పట్టుకుంటాడు. ఆది పట్టుకున్న ఫోటో ఎవరిదో తెలియాలి అంటే ఎపిసోడ్ మొత్తం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం డైరెక్టర్ షో ను హైలెట్ చేయడానికి బాగానే ప్లాన్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…