Huzurabad : హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. తన సమీప తెరాస పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై ఆయన 23వేల ఓట్లకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. గత 6 నెలల నుంచి హుజురాబాద్‌లో బీజేపీ, తెరాసలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఉప ఎన్నికకు గాను ఓట్ల కౌంటింగ్ నిర్వహించారు. ఇందులో మొదటి నుంచి ఈటల ఆధిక్యంలోనే కొనసాగారు.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. మొదటి రౌండ్ నుంచే ఈటల ఆధిక్యంలో కొనసాగారు. కేవలం రెండు రౌండ్లలోనే తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధిక్యం సాధించారు. ఈ క్రమంలోనే ఈటలకు భారీ మెజారిటీ లభించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమే అయ్యాయి.
దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్‌లోనూ ఈటల గెలుస్తారని చెప్పారు. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో ఈటలకు 20వేలకు పైగా మెజారిటీ వస్తుందని అన్నారు. చెప్పినట్లుగానే అంతే మెజారిటీ రావడం విశేషం. ఈ క్రమంలోనే బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు తినిపించుకుంటున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటలకు 96,581 ఓట్లు పోలవ్వగా, గెల్లు శ్రీనివాస్‌కు 75,566 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బి.వెంకట్‌కు కేవలం 2767 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు. ఈ ఉప ఎన్నికలో తెరాసకు పట్టు ఉన్న గ్రామాల్లోనూ బీజేపీ పైచేయి సాధించింది. ఓ దశలో తెరాస భారీ ఎత్తున ఓటుకు ఏకంగా రూ.10వేల వరకు పంచుతుందని బీజేపీ నేతలు ఆరోపించారు. కానీ గెలుపు అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ.. తెరాస డబ్బు, మద్యం పంచినా.. ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారని అన్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…