Sudeepa : విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఇందులో త్రివిక్రమ్ మాటలు ప్రధాన ఆకర్షణ కాగా వెంకీ కామెడీ మాములుగా ఉంటుందా మరి. ఈ మూవీలో వెంకీ.. దిస్ ఇస్ పింకీ అంటూ వెంకీతో తెగ అల్లరి చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప కూడా గుర్తుండాలి మరి. ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది సుదీప. వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో హీరో, హీరోయిన్ తర్వాత మనకి ఎక్కువగా గుర్తుండి పోయేది పింకీ పాత్రే.
ఎందుకంటే.. హీరో, హీరోయిన్లతో సమానంగా ఈ సినిమాలో ఆమె స్క్రీన్ టైం ఉంటుంది. నువ్వు నాకు నచ్చావ్ తర్వాత ఆమె పేరు కూడా సుదీప పింకీగా మారిపోయింది. నువ్వు నాకు నచ్చావ్ తర్వాత సుదీప పింకీ.. బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్‌ఫెక్ట్, లెజెండ్ వంటి హిట్ చిత్రాల్లో కూడా నటించింది. అంతేకాకుండా పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించి బుల్లితెర ఆడియెన్స్ ను కూడా అలరించింది.
ఎంబీఏ వరకు చదువుకున్న సుదీప.. శ్రీరంగనాథన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది. ఇప్పుడు ఈమె సినిమాలకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం సుదీప క్లాసికల్ డాన్స్ స్కూల్ ని నడిపిస్తున్నట్టుగా సమాచారం. తాజాగా సుదీప లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ పిక్స్ లో అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది. వెండి తెరకు సుదీప ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…