Balakrishna : నందమూరి తారక రామరావు నటవారసుడిగా తెలుగుతెరకు పరిచయమయ్యారు బాలకృష్ణ. 1974 లో నందమూరి బాలకృష్ణ 14 ఏళ్ల వయసులో తాతమ్మ కల అనే చిత్రంతో బాల నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేశారు. 1984లో మంగమ్మగారి మనవడు సినిమాతో ఘనవిజయం అందుకొని సోలో హీరోగా స్థిరపడ్డారు. తరవాత కథానాయకుడు, ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369 వంటి ఎన్నో సూపర్ హిట్ లతో తెలుగు సినీని పరిశ్రమ మూడో తరం టాప్ నలుగురు కధనాయకులలో ఒకరిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. బాలకృష్ణ ఇటు సినిమాలోతోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. అఖండతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇంత సక్సెస్ ఫుల్ హీరో అప్పుడప్పుడూ ప్రవర్తన కోపిష్టి అనిపించినప్పటికీ, బాలయ్యని దగ్గరగా చూసిన వాళ్లు మాత్రం ఆయన మనసు వెన్నలా మృదువైనది, ఎంతో స్వచ్ఛమైనది అని చెబుతూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే బాలకృష్ణ చేసే పనులు కూడా నిజమే అనిపిస్తుంటాయి. సామాజిక సేవలు అందిస్తూ బాలయ్య ఎంతో మందికి సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీ మంచి చెడుల గురించి ఆలోచించడంలో బాలయ్య ఎప్పుడూ ముందే ఉంటారని చెప్పొచ్చు.
బాలయ్య చిత్రాలను గమనించి చూస్తే ఈ విషయం మనకు ఎంతగానో అర్థమవుతుంది. బాలయ్య చిత్రాలలో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఆ విషయం ఏమిటంటే.. బాలయ్య చిత్రాల్లో ఎక్కువగా తెలుగు వారికే ప్రాధాన్యత ఇస్తారు. పాపులర్ అయిన వాళ్ళు ఎవరో ఒకరిద్దరు కనిపిస్తారు తప్ప మిగతా వారు సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని భావించేవారు ఎక్కువగా బాలయ్య చిత్రాల్లో కనిపిస్తారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతర భాషల వారికి ప్రాముఖ్యతను ఇస్తారు అని అనుకునే వాళ్లకు బాలయ్య చిత్రలతో తెలుగు వారికి ఎక్కువ అవకాశాలు కల్పించటం ద్వారా ప్రాధాన్యత ఇవ్వడం ఊరట కలుగుతుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…