Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం తన పార్టీ జనసేన కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. మరో 2 ఏళ్లలో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఈ మధ్యే 8 కొత్త వాహనాలను కొన్నారు. అలాగే అక్టోబర్ 5 నుంచి 6 నెలల పాటు బస్సు యాత్ర చేయనున్నారు. దీంతో ఆయనతో సినిమాలు చేద్దామని ఫిక్స్ అయిన నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన ఇప్పటి వరకు ఒప్పుకుని షూటింగ్ దశలో ఉన్న మూవీలను మాత్రమే పూర్తి చేస్తారట. దీంతో హరిహర వీరమల్లు ఈ ఏడాదికి పూర్తవుతుందని భావించారు. కానీ అది జరగబోవడం లేదని తెలుస్తోంది.
పవన్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో రానున్న హరిహర వీరమల్లు చిత్రం 2 ఏళ్లుగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. అయితే ఈ మూవీని ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ కరోనా వల్ల వాయిదా పడింది. దీంతో ఎట్టకేలకు ఫిబ్రవరిలో షూటింగ్‌ను మళ్లీ మొదలు పెట్టారు కూడా. కానీ ఈ మూవీలో కొన్ని సీన్లలో పవన్ చెప్పినట్లు దర్శకుడు క్రిష్ మార్పులు చేయలేదట. దీంతో అసంతృప్తిని వ్యక్తం చేసిన పవన్ ఆ మార్పులు చేసే వరకు షూటింగ్‌కు రానని చెప్పేశారట. దీంతో హరిహర వీరమల్లు షూటింగ్ ఆగిపోయింది.
అయితే పవన్ పాలిటిక్స్ నేపథ్యంలో ఈ మూవీ మళ్లీ తెరమీదకు వచ్చింది. మరోవైపు ఈయన హీరోగా వినోదయ సీతమ్ అనే మూవీని తెరకెక్కించనున్నారు. దీనిక గాను ఆయన అక్టోబర్ వరకు సమయం ఇచ్చారు. కానీ హరిమర వీరమల్లు భవిష్యత్తు ఏమిటనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎం రత్నంలు ఈ నెల చివర్లో పవన్‌తో మీటింగ్ పెట్టి సినిమా షూటింగ్‌పై క్లారిటీని తీసుకోనున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు కాకపోతే ఇక 2 ఏళ్ల వరకు ఈ మూవీని షూట్ చేయలేరు. అదే జరిగితే నిర్మాతకు భారీ నష్టం రావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పవన్ ఆ మీటింగ్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక హరిహర వీరమల్లు భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…