Hansika : టాలీవుడ్‌ను ఒకప్పుడు ఏలిన హీరోయిన్లలో హన్సిక ఒకరు. ఈమె పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన దేశ ముదురు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయింది. బాలనటిగా పలు హిందీ మూవీల్లోనూ ఈమె యాక్ట్ చేసింది. అయితే దేశముదురు సక్సెస్ కావడంతో ఈమె దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. ఈమెకు వరుస చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. దీంతో అప్పట్లో యంగ్ హీరోలు అందరితోనూ ఈ బ్యూటీ నటించింది.
టాలీవుడ్‌ను హన్సిక ఒకప్పుడు ఏలింది. కానీ ఇప్పుడు ఈమెకు ఆఫర్లు అంతగా లేవు. ఒకటి రెండు చిత్రాలు తప్పితే ఈమె పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. అయితే ఇప్పటి వరకు సినిమాల్లో చేసిన హన్సిక ఇకపై వాటికి గుడ్ బై చెప్పి లైఫ్‌లో సెటిల్ అవ్వాలని చూస్తోందట. ఈమెకు 32 ఏళ్లు. దీంతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందట. త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని సమాచారం. హన్సిక ఓ రాజకీయ నాయకుడి కుమారుడితో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇక ఆ రాజకీయ నాయకుడి తనయుడు పలు వ్యాపారాలు చేస్తున్నాడట. ఈ క్రమంలోనే హన్సికతో ప్రేమలో ఉన్న విషయాన్ని అతను తన ఇంట్లోనూ చెప్పాడట. అక్కడ చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. ఇరు వర్గాలకు చెందిన కుటుంబాలు కూడా ఓరే అన్నారట. దీంతో త్వరలోనే వీరిద్దరికీ నిశ్చితార్థం చేయనున్నారని సమాచారం. తరువాత పెళ్లి చేయబోతున్నారని తెలిసింది. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే. వీటిలో నిజం ఎంత ఉంది.. అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా హన్సిక బాలనటిగా హిందీ సినిమాల్లో యాక్ట్ చేసింది. వెండితెరకు దేశముదురు ద్వారా పరిచయం అయింది. తరువాత కంత్రీ, మస్కా, బిల్లా, జయీభవ, సీతారాముల కల్యాణం, కందిరీగ.. వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇక తమిళంలోనూ పలు మూవీల్లో నటిస్తోంది. అయితే హన్సిక పెళ్లి వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…