Gopi Chand : సాధారణంగా మనకు కొన్ని సినిమాల కథలు ఒకేలా అనిపిస్తాయి. కానీ అవి సాగే విధానం వేరేగా ఉంటుంది. కాకపోతే సినిమాల కథలను చూస్తే మాత్రం ఒకేలా అనిపిస్తాయి. ఈ క్రమంలోనే వాటి కథనాలు కూడా వేరుగానే ఉంటాయి. ఇక ప్రముఖ రచయిత పరుచూరి చెప్పిన విధంగా దేవదాసు, అర్జున్ రెడ్డి సినిమాల కథలు ఒకటే. అయినప్పటికీ వాటి కథనాలు వేరేగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాలు కూడా చరిత్రను సృష్టించాయి. ఇవి రెండూ హిట్ సినిమాలే. అయితే కొన్ని సినిమాల కథలు ఒకేలాగా ఉంటాయి. అయినా కూడా వాటి కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితేనే అవి హిట్ గా నిలుస్తాయి. ఇక ఒక్కోసారి హీరోల ఇమేజ్ ను బట్టి, కథనాలను బట్టి సినిమాల ఫలితాలు అనేవి వస్తుంటాయి.
అయితే హీరోలు గోపీచంద్, ఎన్టీఆర్ ఒకేలాంటి కథలతో సినిమాలు చేశారు. కానీ ఈ సినిమా ఫలితాలలో పెద్ద తేడా అయితే లేదు. బీవీఎస్ రవి దర్శకత్వంలో గోపీచంద్ 2011 లో వాంటెడ్ అనే సినిమాలో నటించారు. కాగా ఈ సినిమాలో హీరో, హీరోయిన్ ల మధ్య ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమను పొందాలంటే మాత్రం హీరోయిన్ చెప్పిన పని చేయాల్సి ఉంటుంది. విలన్‌ను చంపాలని హీరోకు హీరోయిన్ కండిషన్ పెడుతుంది. ఇలా ఈ సినిమా సాగుతుంది. ఇక హీరోయిన్ కు చెందిన కుటుంబం మొత్తం ఫ్లాష్ బ్యాక్‌లో చనిపోతారు. వారిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు.
కాగా ఎన్‌టీఆర్‌తో వాంటెడ్ మూవీ స్టోరీనే సురేందర్ రెడ్డి ఊసరవెల్లి సినిమాగా తెరకెక్కించారు. ఇందులోనూ హీరో కోసం హీరో పగ తీర్చుకుంటాడు. కానీ హీరోయిన్ గతం మరిచిపోతుంది. ఆ విషయం మరిచిపోతుందనే ఆమె హీరోకు తన పగ గురించి చెబుతుంది. దీంతో హీరో దాన్ని గుర్తు పెట్టుకుని మరీ ఆమె కోసం పగ తీర్చుకుంటాడు. ఇలా వాంటెడ్, ఊసరవెల్లి.. రెండు సినిమాల్లోనూ ఒకే పాయింట్ మనకు కనిపిస్తుంది. కానీ ఇవి రెండూ సాగిన విధానం వేరేగా ఉంటుంది. అయితే ఈ రెండు చిత్రాలలోనూ వాంటెడ్ చిత్రం ఫ్లాప్ కాగా.. ఊసరవెల్లి చిత్రం మాత్రం బిలో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ రెండు సినిమాలలోనూ ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. ఈ రెండు సినిమాలలోనూ హీరోయిన్ ఫ్యామిలీ లో ఒకరు పోలీస్ ఆఫీసర్ గా ఉంటారు. ఇలా ఈ రెండు సినిమాలకు చెందిన కథల్లోనూ అనేక పోలికలను మనం గమనించవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…