Viral Video : ప్రస్తుత తరుణంలో మహిళలు సమాజంలో వివక్షను, వేధింపులను ఎదుర్కొంటున్నారు. ప్రతి సెకనుకు ప్రపంచంలో ఏదో ఒక చోట మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. పనిచేసే చోట, బహిరంగ ప్రదేశాల్లో, ఇళ్లలోనూ కామాంధులు మహిళలను విడిచిపెట్టడం లేదు. చిన్నారులను సైతం చెరబడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి దేశంలోనూ మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే కొందరు మహిళలు మాత్రం తమను వేధించే వారికి చాలా గట్టిగా బుద్ధి చెబుతున్నారు. అక్కడ కూడా అలాగే జరిగింది. ఓ యువతి తనను వేధిస్తున్న కొందరు యువకులకు దీటుగా సమాధానం చెప్పింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఓ యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. 6 మంది యువకులు ఆమెను వేధించడం మొదలు పెట్టారు. ఆమె చుట్టూ వారు చేరి ఆమెను వేధించసాగారు. అయితే ఉన్నట్లుంగా ఆ యువతి సివంగిగా రెచ్చిపోయింది. తన చుట్టూ ఉన్న యువకులను ఒక్కసారే తన్నింది. దీంతో అందరూ చెల్లా చెదురు అయ్యారు. తరువాత ఒక్కో యువకున్ని పట్టుకుని గాల్లోకి ఎగిరి మరీ వాళ్లను తన్నింది. వాళ్లకు కరాటే పంచ్‌లు ఇచ్చింది. దీంతో ఆ యువకులు అక్కడి నుంచి దెబ్బకు పరారయ్యారు. అలా ఆ యువతి తనను వేధిస్తున్న యువకులకు గట్టిగా బుద్ధి చెప్పింది.
అయితే అదే సమయంలో అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ సంఘటన తాలూకు దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ఆ వీడియోను చూసి కామెంట్లు పెడుతున్నారు. ఆ యువతి ధైర్యానికి ఆమెను ప్రశంసిస్తున్నారు. అలాంటి వారికి అలాగే బుద్ధి చెప్పాలని ఆమెను అభినందిస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటికే 35 లక్షలకు పైగా వ్యూస్ రాగా.. 9వేలకు పైగా ఈ వీడియోను షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…