Garikapati : ప్రముఖ ప్రవనచనకర్త.. గరికపాటి నరసింహారావు.. మెగాస్టార్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. చిరంజీవిలాంటి స్టార్ హీరోను ఉద్దేశించి గరికపాటి చేసిన వ్యాఖ్యలకు ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆయన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబుతో సహా.. పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గరికపాటి ఇలా మాట్లాడటం తగదని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ గరికపాటిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. మెగాస్టార్‌ని ఉద్దేశించి అలా అసహనం వ్యక్తం చేయడం ఏంటి.. ఆయన స్టార్ హీరో.. ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది.
అసలు అంతమంది ఆ ప్రోగ్రాంకి వచ్చిందే చిరంజీవిని చూడ్డానికి. అలాంటిది అభిమాన హీరోని చూసిన వెంటనే ఫోటోలు దిగాలని ఎవరైనా భావిస్తారు. ఇక అభిమానులే తన బలం అని నమ్మే చిరంజీవి.. వారిని నిరుత్సాహపరచరు. అందుకే అంత ఓపిగ్గా వారితో సెల్ఫీలు దిగారు. అందులో తప్పేం ఉంది. దీనిపై గరికపాటి మరి ఆ రేంజ్‌లో అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం కూడా లేదు అంటూ అభిమానులు మండిపడుతున్నారు. బహుశా మెగాస్టార్ క్రేజ్ ముందు ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదనే అక్కసుతోనే గరికపాటి.. ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేసి ఉంటాడు.
కనుక గరికపాటి.. చిరంజీవికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గరికపాటికి గిరిగిపాటి అని పేరు పెట్టడమే కాక.. ఆయన ప్రవచనాలను అడ్డుకుంటామనే ఫోటో కార్డు ఒకటి ప్రసుత్తం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలో గరికపాటి మెగాస్టార్ కు కాల్ చేసి మాట్లాడి ఇష్యూని చల్లబరుస్తాను అని చెప్పినట్లు తెలుస్తోంది. గరికపాటి తన దురుసు ప్రవర్తనతో మెగాస్టార్‌ను పబ్లిక్‌గా అవమానించి.. ఫోన్ కాల్‌లో కాకుండా బహిరంగంగా ఎందుకు క్షమాపణ చెప్పలేరు.. అంటూ ఓ అభిమాని పోస్ట్ చేసాడు. వాడిని వదిలెయ్ బ్రదర్..! అంటూ మరో అభిమాని కామెంట్ చేసాడు. ఈ వివాదానికి ఎవరు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…