Gajuwaka Conductor Jhansi : బుల్లితెరలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. ఈ కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్ట్ లకు జీవితాన్ని ఇచ్చింది. అంతేకాకుండా మల్లెమాల సంస్థ జబర్దస్త్ కు తోడు ఎక్స్ ట్రా జబర్దస్త్ ను మొదలుపెట్టి దిగ్విజయంగా కొనసాగిస్తుంది. ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కి రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. ఈవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమో విడుదల చేశారు షో నిర్వాహకులు. ఈ ప్రోమో లో జడ్జిలుగా ఇంద్రజతో పాటు సింగర్ మనో కూడా కనిపిస్తుండటం విశేషం. ఈ ప్రోమో మొత్తం కామెడీ పంచులతో చూసేవారిని ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ ప్రోమోలో ఎప్పటిలాగానే రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్ టీమ్ స్కిట్లతో అందరినీ కడుపుబ్బ నవ్వించారు. బుల్లెట్ భాస్కర్ టీంలో ఇమ్మానుయేల్, వర్షల కామెడీ వీక్షకులను ఆకట్టుకుంది. ఈసారి భాస్కర్ టీంలో పల్సర్ బండి పాటతో ఫేమస్ అయిన కండక్టర్ ఝాన్సీ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోవడం జరిగింది. ఇదివరకే ఝాన్సీ శ్రీదేవి డ్రామా కంపెనీ లో తన మాస్ డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక స్టేజి మీద రష్మీ కండక్టర్ ఝాన్సీని డాన్స్ పెర్ఫార్మన్స్ తరువాత మీ లైఫ్ ఎలా వుంది అని ప్రశ్నించగా.. ఒక్కసారిగా ఝాన్సీ స్టేజి మీదనే ఎమోషనల్ అయ్యింది.
మొదట్లో అందరూ ఎందుకు డాన్స్ చేసావు అని అన్నవాళ్ళే.. కానీ ఇప్పుడు నాకు ఫోన్ చేసి మీ వల్ల మా కుటుంబం పరువు నిలబడిందని అంటున్నారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి, నన్ను ఈ స్టేజికి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఝాన్సీ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ప్రోమోలోని గాజువాక కండక్టర్ ఝాన్సీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…