Food To Gomatha : గోమాత‌కు ఏయే ఆహారాల‌ను తినిపిస్తే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

Food To Gomatha : హిందువులు ఆవును గోమాతగా భావించి పూజ‌లు చేస్తుంటారు. ఎందుకంటే ఆవు శ‌రీర భాగాల‌న్నింటిలోనూ స‌క‌ల దేవ‌త‌లు కొలువై ఉంటార‌ని చెబుతారు. అందుక‌నే ఆవును గోమాత‌గా పూజిస్తారు. ఆయుర్వేదంలోనూ ఆవుకు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. ఆవు పేడ‌, మూత్రం లాంటివ‌న్నీ ఆరోగ్య‌ప‌రంగా ఎన్నో లాభాల‌ను అందిస్తాయి. వాటితో ప‌లు వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ఇలా ఆవు వ‌ల్ల మ‌న‌కు అన్ని విధాలుగా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే గోమాత‌కు ప‌లు ర‌కాల ఆహారాల‌ను తినిపించ‌డం వ‌ల్ల మ‌నం ప‌లు ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. వాటికి తినిపించే ఆహారాన్ని బ‌ట్టి మ‌న‌కు ఫ‌లితాలు క‌లుగుతాయి. గోమాత‌కు ఏయే ఆహారాల‌ను తినిపిస్తే ఎలాంటి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

గోమాత‌కు నాన‌బెట్టిన ఉల‌వ‌ల‌ను పెట్ట‌డం వ‌ల్ల వృత్తిలో నిల‌క‌డ ఉంటుంది. స్థాన చ‌ల‌నం, ఒత్తిడి, ఆందోళ‌న వంటివి లేకుండా సాఫీగా ప‌నిచేస్తారు. వ్యాపారులు అయితే స్థిరంగా లాభాలు వ‌స్తాయి. న‌ష్టాలు రాకుండా ఉంటాయి. అలాగే గోమాత‌కు నాన‌బెట్టిన బొబ్బ‌ర్లను పెట్ట‌డం వ‌ల్ల ధ‌నం అభివృద్ధి చెందుతుంది. డ‌బ్బు బాగా సంపాదిస్తారు. డ‌బ్బుకు లోటు రాదు. నాన‌బెట్టిన గోధుమ‌ల‌ను పెడితే కీర్తి, ప‌ట్టుద‌ల పెరుగుతాయి. తోట‌కూర, బెల్లం క‌లిపి పెడితే మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. నాన‌బెట్టిన కందుల‌ను పెడితే కోపం త‌గ్గుతుంది. ప్ర‌శాంతంగా ఉంటారు. నాన‌బెట్టిన మినుముల‌ను గోమాత‌కు పెడితే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అనేక ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు.

Food To Gomatha

గోమాత‌కు నాన‌బెట్టిన శ‌న‌గ‌ల‌ను పెట్ట‌డం వ‌ల్ల ఆధ్యాత్మిక చింత‌న అల‌వ‌డుతుంది. నాన‌బెట్టిన పెస‌ల‌ను పెడితే విద్య‌లో అభివృద్ధి చెందుతారు. ఉన్న‌త స్థానాల‌కు చేరుకుంటారు. బంగాళా దుంప‌ల‌ను గోమాత‌కు పెట్ట‌డం వ‌ల్ల న‌ర‌ఘోష నివార‌ణ‌, న‌ర దిష్టి పోతాయి. క్యారెట్ల‌ను తినిపిస్తే వ్యాపారంలో అభివృద్ధి జ‌రుగుతుంది. డ‌బ్బు బాగా సంపాదిస్తారు. బీట్‌రూట్ లేదా పాల‌కూర పెడితే ఐశ్వ‌ర్యాలు క‌లుగుతాయి. దోస‌కాయ‌ల‌ను తినిపిస్తే శ‌త్రువులు నివారించ‌బ‌డ‌తారు. ట‌మాటాల‌ను పెడితే వివాహం త్వ‌ర‌గా జ‌రుగుతుంది. వంకాయ‌ల‌ను పెడితే సంతాన ప్రాప్తి జ‌రుగుతుంది.

గోమాత‌కు అర‌టి పండ్ల‌ను తినిపిస్తే ఉన్న‌త ప‌దవుల‌ను చేప‌డుతారు. బెండ‌కాయ‌ల‌ను తినిపిస్తే మ‌నోస్థైర్యం క‌లుగుతుంది. దొండ‌కాయ‌ల‌ను తినిపిస్తే మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను పొంద‌వ‌చ్చు. మిన‌ప‌పిండి బెల్లం పెడితే అఖండ ఐశ్వ‌ర్య ప్రాప్తి జ‌రుగుతుంది. గోధుమ పిండి బెల్లం పెడితే ఉద్యోగం వ‌స్తుంది. నాన‌బెట్టిన చాయ పెస‌ర ప‌ప్పును పెడితే ఇంద్రియ నిగ్ర‌హం క‌లుగుతుంది. నాన‌బెట్టిన కందిప‌ప్పును తినిపిస్తే రుణ విముక్తులు అవుతారు. నాన‌బెట్టిన మిన‌ప ప‌ప్పును తినిపిస్తే ఆరోగ్యం క‌లుగుతుంది. వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు. నాన‌బెట్టిన ప‌చ్చి శ‌న‌గ ప‌ప్పును గోమాత‌కు తినిపిస్తే కుటుంబంలో ఉండే క‌ల‌హాలు తొల‌గిపోతాయి. పొట్ట పెస‌ర ప‌ప్పును నాన‌బెట్టి గోమాత‌కు తినిపిస్తే బుద్ధి కుశ‌ల‌త వ‌స్తుంది. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. తెలివి తేట‌లు వ‌స్తాయి. చ‌దువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో రాణిస్తారు. ఇలా భిన్న ర‌కాల ఆహారాల‌ను గోమాత‌కు పెట్ట‌డం వ‌ల్ల భిన్న‌మైన ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM