Sai Pallavi : తెలుగు సినీ ప్రేక్షకులకు సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగులో నటించిన చిత్రాల ద్వారానే ఎక్కువగా పేరు తెచ్చుకుంది. మొదటి నుంచి ఈమె వివాదాలకు దూరంగా ఉంటుంది. అలాగే ఏ కంపెనీకి కూడా ప్రమోషన్ చేయనని స్పష్టంగా చెప్పేసింది. గ్లామర్ షోకు కూడా దూరంగా ఉంటానని తెలియజేసింది. దీంతో సాయిపల్లవికి అభిమానులు బాగానే ఏర్పడ్డారు. అయితే మొదట్నుంచీ వివాదాలకు దూరంగా ఉండే ఈమె తాజాగా అవనసరమైన కామెంట్స్ చేసి వివాదాల్లో ఇరుక్కుంది. దీంతో ఆమె తాజా మూవీ విరాట పర్వంకు సమస్యలు ఎదురయ్యేలా ఉన్నాయి.
విరాట పర్వం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సాయిపల్లవి మాట్లాడుతూ.. గోహత్యకు, కాశ్మీర్ పండిట్ల హత్యలకు పెద్దగా తేడా ఏమీ లేదని.. రెండూ ఒకటేనని.. మతం ముసుగులో చేసే ఇలాంటి కార్యక్రమాలను తాను తీవ్రంగా ఖండిస్తానని.. ముందు అసలు మనుషులను మనుషులుగా చూడాలని.. మతం రంగు పులుమొద్దని.. కామెంట్స్ చేసింది. అయితే ఈమె వ్యాఖ్యల్లోని కొన్ని క్లిప్స్‌ను మాత్రమే కొందరు ప్రచారం చేశారు. అసలు ఆమె ఏం మాట్లాడిందో ప్రజలకు సరిగ్గా తెలియలేదు. దీంతో ఆమె ఈ కామెంట్స్ చేయడం ద్వారా అనవసరంగా వివాదంలో చిక్కుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బ్యాన్‌విరాటపర్వం అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇలా సాయిపల్లవి అనవసరంగా కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుపోవడంతో ఇప్పుడు విరాటపర్వంకు సమస్యలు వచ్చేలా కనిపిస్తున్నాయి.
వాస్తవానికి సాయిపల్లవి వివాదాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉంటుంది. కానీ ఆమె ఈసారి ఎందుకో ఇలా అనవసరంగా కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుంది. ఈ క్రమంలోనే ఆమె తొలిసారిగా ట్రోలింగ్‌కు, విమర్శలకు గురవుతోంది. ఇవన్నీ చాలా సున్నితమైన అంశాలు. వీటిపై సినీ సెలబ్రిటీలు మాట్లాడే ప్రయత్నం చేయరు. కానీ సాయి పల్లవికి అలా ఎందుకు అనిపించిందో.. ఏది ఏమైనా ఆమె చేసిన కామెంట్స్ వల్ల ఆమె ఇప్పుడు మొదటిసారిగా తీవ్ర విమర్శల పాలవుతోంది. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…