Extra Jabardasth : నటుడు విశ్వక్ సేన్‌తో గొడవ ఏమోగానీ.. దేవీ నాగవల్లిని ఇప్పుడు నెటిజన్లు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అసలు సమయం.. సందర్భం లేకుండా ప్రతి టాపిక్ లోకి ఆమెను లాగుతున్నారు. ఏ వివాదంలోకి అయినా సరే దేవి నాగవల్లిని తీసుకువచ్చి.. పనిలో పనిగా ఆమెను కూడా ట్రోల్ చేస్తున్నారు. మొన్నా మధ్య మహేష్ ఫ్యాన్స్‌కు.. ఓ చానల్‌కు మధ్య జరిగిన రచ్చలో దేవి నాగవల్లిని కూడా టార్గెట్ చేశారు. ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఇది జబర్దస్త్ కు కూడా పాకింది. అందులో నరేష్ చేసిన స్కిట్‌లో ఆయన దేవి నాగవల్లిని భలే ఇమిటేట్ చేశాడు.
మే 20వ తేదీన ప్రసారం కానున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ స్కిట్‌లో భాగంగా కెవ్వు కార్తీక్, పొట్టి నరేష్‌లు ఓ స్కిట్ చేసి అలరించారు. అందులో నరేష్ ఒక అమ్మలా వేషం వేసుకోగా ఆమెకు కొడుగ్గా కార్తీక్ వచ్చాడు. ఇక అమ్మ వేషంలో ఉన్న నరేష్.. కాలేజీకి చదువుకోమని పంపిస్తే.. వేషాలేస్తున్నారేంట్రా.. అని అడగ్గా.. అందుకు కార్తీక్ ఏదో చెప్పబోతాడు.. దీంతో నరేష్ కలగజేసుకుని.. దేవి నాగవల్లి వాడిన గెటవుట్ డైలాగ్ చెబుతాడు. దీంతో కార్తీక్ వాట్ ది ఎఫ్** అనే వాక్యం అనేలోగా మళ్లీ నరేష్ కలగజేసుకుని.. మళ్లీ గెటవుట్.. ఈ స్కిట్ నుంచి గెటవుట్ అని దేవి నాగవల్లి అన్నట్లుగానే అన్నాడు. దీంతో అక్కడ అంతా నవ్వులు విరబూశాయి.
ఇక ఈ ఎపిసోడ్‌కు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయన దర్శకత్వం వహించిన ఎఫ్3 మూవీ ఈ నెల 27వ తేదీన రిలీజ్ కానుంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టింది. ఎఫ్2కు సీక్వెల్‌గా రానున్న ఈ మూవీలో ఎఫ్2 లాగే సేమ్ కాంబినేషన్‌ను రిపీట్ చేశారు. ఇక ఈ మూవీకి టిక్కెట్ల రేట్లను పెంచడం లేదని నిర్మాత దిల్ రాజు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…