Evaru Meelo Koteeshwarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వైపు సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా సత్తా చాటుతూనే.. మరోవైపు స్మాల్ స్క్రీన్ పై హోస్ట్ గా అలరిస్తున్నాడు. జెమిని టీవీలో స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమంతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాగా, ఇక్కడ మనీతోపాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు.. కథ మీది, కల మీది.. ఆట నాది.. కోటి మీది. రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులు.. అంటూ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. ఈ షో సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.
అయితే ఈ షోలో ఇప్పటి వరకూ హాట్ సీట్ లో కూర్చుకున్న ఎవరూ కూడా రూ.1 కోటి ప్రశ్న వరకూ చేరుకోలేదు. అయితే తొలిసారిగా ఓ వ్యక్తి కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఓ పోలీస్ అధికారి కోటి రూపాయలు గెలుచుకున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఆ వ్యక్తిని మాత్రం రివీల్ చేయలేదు. త్వరలో ఈ ఎపిసోడ్ ప్రసారం చేయబోతున్నారు.
రామ్ చరణ్ తో మొదలైన ఈ షోలో ఎంతో మంది సామాన్యులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సమంత, కొరటాల శివ, రాజమౌళి వంటి వారు గెస్ట్‌లుగా సందడి చేశారు. త్వరలో మహేష్ బాబు గెస్ట్ గా హాజరైన షో కూడా ప్రసారం కానున్నదని తెలుస్తోంది. ఈ సీజన్ ను నవంబర్ 18 ఎపిసోడ్ తో ముగించబోతున్నారు. ఆ ఎపిసోడ్ లో మహేష్ బాబు కనిపించబోతున్నాడు.. అని టాక్ వినిపిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…