Chiranjeevi : ఒకప్పుడు యాడ్స్ అంటే కేవలం మోడల్స్ మాత్రమే ఎక్కువ చేసేవారు. కానీ ఈ తర్వాత కాలంలో జనాలలో సినిమా నటులకు కూడా మంచి గుర్తింపు రావడం మొదలయింది. ఏ స్టార్స్ అయితే ప్రజలలో ఎక్కువగా ఆదరణ ఉంటుందో ఆ స్టార్స్ తో యాడ్స్ తీయడం మొదలయ్యింది. ఇప్పుడు ఏకంగా కోట్లు ఇచ్చి వాల బ్రాండ్లు ప్రోమోట్ చేస్కోడంకి.. స్టార్స్ ని బ్రాండ్ అంబాసిడర్స్ గా పెట్టుకుంటున్నారు. స్టార్స్ సైతం సినిమాల్లో కన్నా కూడా యాడ్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం రావడంతో ప్రకటనలో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
అయితే గతంలో థమ్స్ అప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్ చిరంజీవి వ్యవహరిస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెప్సికి బ్రాండ్ అంబాసిడర్ ఉండేవారు. అంతేకాదు నవరత్న ఆయిల్ కి కూడా చిరంజీవి అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత కాలంలో థమ్స్ అప్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. అయితే చిరు థమ్స్ అప్ యాడ్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసినపుడు ఒక వివాదం తలెత్తింది. కానీ మహేష్ ఈ యాడ్ చేసే టైంలో ఎలాంటి వివాదం రాలేదు.
ఓ బాధ్యతాయుతమైనా స్థానంలో ఉంటూ, చిన్నపిల్లలకు ,పెద్దలకు చెడు చేసే ఇలాంటి హానికరమైన శీతల పానీయాలకు అనుకూలంగా ప్రకటనలు చేయడం ఏమిటని చాలామంది చిరంజీవిని విమర్శించడం మొదలుపెట్టారు. ఈ విమర్శలకు ఫలితంగా చిరంజీవి,పవన్ కళ్యాణ్ లు నాటినుంచి నేటివరకూ కూడా ఎలాంటి వాణిజ్య ప్రకటనలలో పాలుపంచుకోవడం లేదు. కేవలం ఈ ఒక్క కారణం వల్లే పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్, హీరోయిన్స్ రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, సమంత వంటి వారు సినిమాలతో పాటు అనేక వాణిజ్య ప్రకటనలో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదించుకుంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…