Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన స్వయంకృషితో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హోదాను సంపాదించుకున్నారు. 150 చిత్రాలకు పైగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించారు మెగాస్టార్ చిరంజీవి. నటనలో ఎంత కష్టమైన పనిని కూడా అవలీలగా చేస్తూ ఎన్నో సినిమాలలో రియల్ స్టంట్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. 66 ఏళ్ల వయసులో కూడా ఇప్పటి తరం హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను అందుకుంటున్నారు.
1978వ సంవత్సరంలో పునాదిరాళ్లు చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించి ఎన్నో ఘన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. సుప్రీం హీరో, టాప్ హీరో, మెగాస్టార్ అంటూ ఎన్నో బిరుదులు ఆయన సొంతం చేసుకున్నారు. అంత గొప్పగా ఉండేది చిరంజీవి నటన. అప్పట్లో చిరంజీవి చిత్రాలలో ఎలాంటి కష్టమైన స్టంట్ చేయడానికి కూడా వెనుకాడేవారు కాదు. ఇప్పుడు వయస్సు రీత్యా స్టంట్స్ విషయంలో రిస్క్ తీసుకోవడం లేదు. అయితే గత 30 సంవత్సరాలుగా చిరంజీవికి ఒక వ్యక్తి డూప్ గా నటిస్తున్నారు.
చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ రియల్ రిస్కీ ఫైట్లతో అలరించే హీరోలు అప్పుడప్పుడూ డూప్ లతో కూడా కొన్ని సన్నివేశాలు చేయవలసిన సందర్భాలు ఏర్పడతాయి. కొన్ని రిస్క్ స్టంట్స్ చేసే టైంలో హీరోలకు ఏదైనా ప్రమాదం జరుగుతుందనే భయం కారణంతో ఆ టైంలో డూప్ లతో సన్నివేశాలు చిత్రీకరిస్తారు దర్శకనిర్మాతలు. అంతటి రిస్క్ సన్నివేశాలు చేసినా కూడా అప్పటి రోజుల్లో డూప్ ల గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలిసేది కాదు.
కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రతి విషయాలు క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. అంతేకాకుండా హీరోలకు నటించే డూప్ ల గురించి కూడా తెలుస్తోంది. ఇక ఇలా హీరోలకు డూప్ లుగా వ్యవహరించే వారిని కొన్ని చానెల్స్ లైవ్ లోకి తీసుకువస్తుండటంతో వారికి కూడా గుర్తింపు వస్తోంది.
అయితే ఇటీవలే ఒక షో లో చిరంజీవికి గత 30 ఏళ్లుగా డూప్ గా చేస్తున్న వ్యక్తి ఎవరు అనే విషయాలు బయటకు వచ్చాయి. ఈటీవీ లో శ్రీదేవి డ్రామా కంపెనీ షో నిర్వాహకులు కొన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడ టాలెంట్ ఉన్న వ్యక్తులను బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లగా ఆ షోలోకి చిరంజీవికి డూప్ గా వ్యవహరించే వ్యక్తి వెలుగులోకి రావడం జరిగింది. అతని పేరు ప్రేమ్ కుమార్. ఈయన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మార్టూరుకి చెందినవాడు. ప్రేమ్ కుమార్ చిరంజీవికి 30 ఏళ్ళ నుంచి డూప్ గా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…