మెగా ఫ్యామిలీలో ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారు ఎవరో తెలుసా..?

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ముఖ్యమైన ఘట్టం. ఒకప్పుడు పెళ్లి అంటే భార్యాభర్తలు నిండు నూరేళ్ల పాటు కలిసి ఉండే దాంపత్య జీవితంగా ఉండేది. కానీ ప్రస్తుత ఆధునిక‌ యుగంలో పెళ్లి అనే పదానికి అర్థం మారిపోయింది. ఒక్కొక్కరి జీవితంలో ఎన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయో చెప్పలేని పరిస్థితి నెల‌కొంది. ఇప్పటికే సీనియర్ నటుడు నరేష్ కు మూడు పెళ్లిళ్లు కాగా.. ఇప్పుడు పవిత్రా లోకేష్‌తో నాలుగో పెళ్లికి కూడా సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మెగా ఫ్యామిలీలో కొందరికి రెండు లేదా మూడు పెళ్లిళ్లు కూడా జరిగాయి. మెగా ఫ్యామిలీలో ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకున్న వారు ఎవరో చూద్దాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో కూడా వ్యక్తిగత జీవితం గురించే మాట్లాడుతూ మూడు పెళ్లిళ్లు అంటూ ఉంటారు. పవన్ సినిమాల్లోకి రాకముందు వైజాగ్ కు చెందిన నందినిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తనతో బద్రి, జానీ సినిమాల్లో నటించిన రేణు దేశాయ్ ను రెండో పెళ్లి చేసుకోగా.. తీన్మార్ సినిమాలో నటించిన రష్యన్ అమ్మాయి అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకున్నారు.

చిరంజీవి చెల్లెలు హీరో సాయి ధరమ్ తేజ్ తల్లి విజయ‌దుర్గ‌కు కూడా పెళ్లి కలిసి రాలేదు. సాయిధరమ్ తేజ్ – వైష్ణవ తేజ్ పుట్టాక భర్తతో విడాకులు అయ్యాయి. దాదాపు 15 – 20 సంవత్సరాల పాటు ఆమె భర్తకు దూరంగానే ఉంది. వీరిద్దరూ పెరిగి పెద్దయ్యాక తనకు తోడు కావాలనుకున్న విజయదుర్గ ఓ డాక్టర్‌ను రెండో పెళ్లి చేసుకుంది.

చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ తాను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్‌ను ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. ఒక కుమార్తె పుట్టాక భరద్వాజ్ కు విడాకులు ఇచ్చేసిన శ్రీజ కళ్యాణ్‌దేవ్‌ ను రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కళ్యాణ్ దేవ్‌కు కూడా ఆమె విడాకులు ఇస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అల్లు కుటుంబాన్ని కూడా మెగా ఫ్యామిలీ నుంచి దూరంగా చూడలేము. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్యతో ఒక కూతురు పుట్టాక విడిపోయి ఇప్పుడు ముంబైకి చెందిన డిజైనర్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. అలా మెగా కాంపౌండ్‌లో న‌లుగురికి ఒకటికి మించిన పెళ్లిళ్లు జరిగాయి.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM