Vasundhara : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటిస్తూ బాలకృష్ణ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో పేరున్న హీరో బాలకృష్ణ ఒక్కరే. ఆయన తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వెనుతిరిగి చూసుకోలేదు. బాలనటుడి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో పాత్రలను పోషించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. బాలయ్య సినిమాలకు దగ్గరగా ఉన్నా.. ఆయన భార్య వసుంధర మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
బాలయ్య భార్య గురించి అభిమానులకు ఎక్కువగా తెలియదు. అయితే బాలయ్య సినిమాలలో ఆమెకు ఇష్టమైన సినిమా చెన్నకేశవరెడ్డి కావడం గమనార్హం. చెన్నకేశవరెడ్డి డైరెక్టర్ వివి వినాయక్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్య తండ్రి, కొడుకు పాత్రల్లో నటించారు. అయితే వసుంధరకు మాత్రం కొడుకు పాత్ర కంటే తండ్రి పాత్రే ఎంతో ఇష్టమట. చెన్నకేశవరెడ్డి షూట్ సమయంలో బాలయ్య ఎంతో ఉత్సాహంగా ఉండేవారని వసుంధర వినాయక్ తో అన్నారట.
అయితే ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది. స్టార్ హీరో అయినప్పటికీ బాలయ్య నిజ జీవితంలో చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమా, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు. బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లలో అఖండను మించి బ్లాక్ బస్టర్ హిట్లు కొడతారో లేదో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…