Karthikeya 2 : నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జోడిగా నటించిన కార్తికేయ 2 మూవీ ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చందూ మొండేటి డైరెక్షన్లో 2014లో నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత కార్తికేయ 2 వస్తుందని ప్రకటన రాగానే అందరిలో కొద్దిపాటి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం కార్తికేయ 2 చిత్రం అంచనాలకు మించి దేశవ్యాప్తంగా దూసుకుపోతూ నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. దేశవ్యాప్తంగా కార్తికేయ 2 కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది.
ఓటీటీలో సినిమాలు చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించలేము అనే నమ్మకంతో ఉన్న దర్శక నిర్మాతల అభిప్రాయం తప్పు అనే విషయాన్ని కార్తికేయ 2 చిత్రం ప్రూవ్ చేసింది. కంటెంట్ బాగుంటే ఏ బాష అయినా సరే సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆరాధిస్తారు అని చెప్పడానికి ఈ చిత్రం ఉదాహరణగా నిలిచింది. కేవలం 13 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ 60 కోట్ల రూపాయిల వరుకు షేర్స్ ని రాబట్టింది. హిందీ లో అయితే కేవలం 60 షోలతో ప్రారంభం అయ్యి మొదటి రోజు కేవలం 2 లక్షల రూపాయిలు మాత్రమే నెట్ వసూళ్లు చేసింది. కానీ ప్రేక్షకులలో మంచి పాజిటివ్ టాక్ రావడంతో రెండవ రోజు నుండి కలెక్షన్స్ పెరుగుతూ పోయాయి. అలా రోజు రోజుకీ వసూళ్లు పెరుగుతూ కార్తికేయ 2 హిందీ లో ఏకంగా 35 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం వచ్చే 4వ తేదీన OTT లో విడుదల కాబోతున్న సందర్బంగా థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయ్యింది.
ప్రాంతాల వారీగా ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే.. ఒక్క నైజం ప్రాంతంలోనే ఈ సినిమా దాదాపుగా 13 కోట్ల రూపాయలకు పైగా షేర్ ను వసూళ్లు చేసింది. రాయలసీమ రూ.5 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 4.50 కోట్లు. గోదావరి జిల్లాలు రెండు కలుపుకొని రూ. 4 కోట్లు. గుంటూరు రూ.2.80 కోట్లు. కృష్ణ రూ. 2.30 కోట్లు. నెల్లూరు 1.10 కోట్ల రూపాయల వసూళ్ళని రాబట్టి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్ల రూపాయిల షేర్ రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో 7 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం కర్ణాటక లో 3 కోట్ల రూపాయిలు వసూలు చేసింది. ఇక హిందీ వెర్షన్ లో 16 కోట్ల రూపాయిల షేర్ ను రాబట్టింది. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా అన్ని భాషలకు కలిపి 60 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టుకుందని ట్రేడ్ వర్గాల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…