Taraka Ratna : కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తారకరత్నకి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. నందమూరి వంశం నుండి 11 ఏళ్ళ కిందట హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తారక రత్న. అప్పటి నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న తారకరత్న ఇటీవల టీడీపీలో యాక్టివ్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ తో భేటీ అయ్యి.. నారా కుటుంబానికి జై కొట్టేశాడు. బాబాయ్ బాలయ్య బాబుతో కార్యకర్తలని ఉత్సాహపరుస్తూ సాగుతున్న పాదయాత్రలో అనుకోకుండా కుప్పకూలిపోయాడు తారకరత్న. ప్రస్తుతం ఆయన క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నారు.
తారకరత్న త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కోరుకుంటూ.. ఆయన రికార్డులని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నందమూరి కుటుంబంలో తారకరత్న ఒక ఫెయిల్యూర్ హీరో అయినా.. ఆయన పేరుపై ఒక వరల్డ్ రికార్డు ఉంది. ఇతర హీరోలెవరూ కూడా టచ్ చేయలేని రికార్డ్‌ని తారకరత్న అందుకున్నాడు. ఒకటో నంబర్ కుర్రాడు మూవీ ఓపెనింగ్ రోజే ఏకంగా 9 సినిమాలని ప్రకటించాడు తారకరత్న. ఇదొక వరల్డ్ రికార్డు. ఇండస్ట్రీకి ఎవరైనా ఒక సినిమాతో ఎంట్రీ ఇస్తారు.. లేదంటే రెండు సినిమాలతో వస్తారు. కానీ ఒకేసారి 9 సినిమాలతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించాడు ఈ నందమూరి హీరో.
తారకరత్న ప్రకటించిన 9 సినిమాల్లో ఎక్కువ శాతం రిలీజ్ కాలేదు. ఒకటో నంబర్ కుర్రాడు తరువాత.. యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలినవన్నీ ఆగిపోయాయి. వీటిలో ఒక్కటి కూడా హిట్ కాకపోవటంతో.. కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని అమరావతి సినిమాతో విలన్ అయ్యాడు. అయితే ఆ సినిమా కూడా నిరాశ మిగల్చటంతో.. ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చివరిగా ఓ వెబ్ సిరీస్‌లో కనిపించి మెప్పించాడు. మంచి టాలెంట్ ఉన్న తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…