Baahubali : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు పార్ట్‌లుగా వచ్చిన ఈ మూవీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. నిర్మాతలకు కాసుల పంటను కురిపించింది. రెండు మూవీలకు కలిపి సుమారుగా రూ.500 కోట్ల బడ్జెట్ కాగా.. రూ.2000 కోట్ల వరకు ఈ మూవీలు వసూలు చేయడం విశేషం. ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయంతో అలరించాడు. అలాగే భల్లాల దేవుడి పాత్రలో రాణా ఆకట్టుకున్నాడు. ఇక అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, కిచ్చ సుదీప్ వంటి వారు అద్భుతంగా నటించారు. అలాగే కట్టప్ప పాత్ర చేసిన సత్యరాజ్‌కు కూడా బాగానే పేరు వచ్చింది.
బాహుబలి సినిమాల ద్వారా రాణా, ప్రభాస్‌లు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. దీంతో వారి సినిమాలకు క్రేజ్ ఏర్పడింది. అయితే బాహుబలి సినిమాలు వచ్చి అన్ని సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ వీటి గురించి ఏదో ఒక విషయం బయట పడుతూనే ఉంది. తాజాగా ఈ మూవీలోని పాటకు చెందిన వివరాలు వైరల్ అవుతున్నాయి. బాహుబలి మొదటి పార్ట్‌లో అవంతికను వెదుకుతూ శివుడు అలియాస్ మహేంద్ర బాహుబలి వెళ్తాడు. ఆ సమయంలో ఒక సాంగ్ వస్తుంది. ఆ తరువాత ఇద్దరూ కలసిపోతారు. అప్పుడు ఇంకో పాట వస్తుంది. అయితే ఈ పాటలకు చెందిన బడ్జెట్ వివరాలే దిమ్మతిరిగిపోయేలా ఉన్నాయి.
అప్పట్లో ఈ రెండు పాటలకు ఒక్కో దానికి రూ.2.50 కోట్ల చొప్పున రూ.5 కోట్లు ఖర్చు చేశారట. కేవలం పాటలనే అత్యంత అద్భుతమైన గ్రాఫిక్స్ తో రూపొందించారు. కనుకనే ఆ పాటలు ఆ స్థాయిలో ఫేమస్ అయ్యాయి. ధీవరా.. అనే పాటతోపాటు పచ్చ బొట్టేసినా.. అనే సాంగ్.. ఈ రెండూ కలిపి రూ.5 కోట్ల మేర ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అప్పటి ఆ పాటలకు చెందిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…