Bommarillu : బొమ్మరిల్లు వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను వదులుకున్న ఆ హీరో ఎవరో తెలుసా..?

Bommarillu : సినీ ఇండస్ట్రీలో భారీ ప్రమోషన్స్ తో బయటకు వచ్చిన సినిమాలు కూడా అంచనాల‌ను తారుమారు చేస్తూ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిపోతాయి. అదేవిధంగా ఒకసారి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిత్రాలే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తాయి. ఏ అంచనాలు లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఒక్క సినిమాతో హిట్ అందుకొని రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోలు ఎంతో మంది ఉన్నారు. 2006 సంవత్సరంలో సిద్ధార్థ్, జెనీలియా జంటగా వచ్చిన చిత్రం బొమ్మరిల్లు. ఈ చిత్రంతో సిద్ధార్థ్ క్రేజ్ యూత్ లో ఒక్కసారిగా పెరిగిపోయింది.

అదేవిధంగా హా.. హ.. హాసిని అంటూ జెనీలియా క్యారెక్టర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన భాస్కర్ కు సైతం బొమ్మరిల్లు భాస్కర్ అనే పేరును ముద్ర వేసింది. బొమ్మరిల్లు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికి కూడా వినేవాళ్లకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఆరు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన బొమ్మరిల్లు చిత్రం అప్పట్లో ఘన విజయాన్ని సాధించి రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టింది.

Bommarillu

అయితే బొమ్మరిల్లు చిత్రానికి ముందుగా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు భాస్కర్ ఒక హీరోను అనుకోవటం జరిగిందట. అతను ఇంకెవరో కాదు హీరో నవదీప్. నిర్మాత దిల్ రాజు బొమ్మరిల్లు చిత్రంతో నవదీప్ ని తెలుగు తెరకు పరిచయం చేద్దామని అనుకున్నారు. కానీ నవదీప్ అప్పటికే జై చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి, గౌతమ్ ఎస్ఎస్సి, మొదటి సినిమా, ప్రేమంటే ఇంతే చిత్రాలలో బిజీగా ఉన్నాడు. దానితో నవదీప్ డేట్స్ అడ్జస్ట్ కాక బొమ్మరిల్లు చిత్రానికి నో చెప్పడం జరిగింది.

నవదీప్ నో చెప్పడంతో బొమ్మరిల్లు చిత్రం కాస్త సిద్ధార్థ్ ని వరించింది. ఈ చిత్రంతో సిద్ధార్థ్ సక్సెస్ ని అందుకొని ఓవర్ నైట్ లో యూత్ లో క్రేజ్ ఉన్న హీరో గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఏ చిత్రాల‌ కోసమైతే నవదీప్ బొమ్మరిల్లు చిత్రాన్ని వదులుకున్నాడో ఆ చిత్రాలు కాస్తా బాక్సాఫీస్ వద్ద అనుకున్న మేరకు విజయం సాధించలేకపోయాయి. అప్పుడప్పుడూ నవదీప్ కూడా బొమ్మరిల్లు చిత్రాన్ని వదులుకుని తప్పు చేశాను అంటూ కొన్ని సందర్భాల్లో బాధ పడుతూ ఉండేవాడట. అందుకే అంటారు.. త‌ల‌రాత ఎలా రాసి ఉంటే అలా జ‌రుగుతుందని. అది అక్ష‌రాలా స‌త్యం అని చెప్ప‌వ‌చ్చు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM