Samantha : నటి సమంత గత 10 రోజుల కిందట స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేసిన విషయం విదితమే. మంచు పర్వతాల్లో సమంత సరదాగా గడిపింది. అలాగే అక్కడ మంచుపై స్కీయింగ్ కూడా చేసింది. అనేక సార్లు ఆమె ఫెయిల్ అయినప్పటికీ కేట్ అనే శిక్షకురాలి సహాయంతో సమంత ఎట్టకేలకు స్కీయింగ్ చేయడం నేర్చుకుంది. ఇక ఆ సమయంలో తీసిన ఫొటోలను, వీడియోలను సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.
స్విట్జర్లాండ్‌లో సమంత రోజుకు 6 గంటల పాటు స్కీయింగ్ చేసింది. ఈ క్రమంలోనే ఆమెకు ఉన్న స్కిల్స్‌ను అందరూ అభినందిస్తున్నారు. ఇక స్కీయింగ్ చేసేటప్పుడు ఆమె ఒక ఎల్లో కలర్ జాకెట్‌ను ధరించింది. అది టోనీ సెయిలర్ జాకెట్ కాగా దాని ధర రూ.75వేలు. ఇక కొన్ని వీడియోల్లో ఆమె బ్లాక్ జాకెట్ ధరించి కనిపించింది. దాని ధర ఏకంగా రూ.1.20 లక్షలు కాగా అది మాన్‌క్లెర్ బ్రాండ్‌కు చెందినది. ఈ క్రమంలోనే సమంత ధరించిన స్కీయింగ్ జాకెట్ల ధర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇక సమంత ఇటీవలే పుష్ప మూవీలో ఊ అంటావా సాంగ్‌తో అలరించింది. ఆ ఒక్క పాట చేసినందుకే ఆమెకు ఎంతగానో పేరు వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెకు పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసేందుకు ఆఫర్లు వస్తున్నాయి.
సమంత ప్రస్తుతం శాకుంతలం, యశోద అనే సినిమాలు చేస్తోంది. అలాగే మరో హాలీవుడ్, బాలీవుడ్ మూవీలతోపాటు ఓ థ్రిల్లర్ సిరీస్ చేసేందుకు కూడా రెడీ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…