Viral Pic : చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరో హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఇండస్ట్రీలో చిన్న వయస్సులోనే నటన ప్రారంభించి ఆ తర్వాతి కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వాళ్ళల్లో ఈ చిన్నారి కూడా ఉంది. ఈ ఫొటోలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేతిలో ఎంతో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్. అంతేకాకుండా ఈమె పలు సీరియల్స్ లో కూడా నటించడం జరిగింది.
2000 లో రిలీజ్ అయిన జగపతిబాబు, అర్జున్ హీరోలుగా నటించన హనుమాన్ జంక్షన్, మహేష్ బాబు హీరోగా చేసిన యువరాజు సినిమాలోను, రవి తేజ నటించిన వీడే చిత్రంలో కూడా ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది. ఇక ఆ తర్వాత తన దృష్టి మొత్తాన్ని చదువులపై పెట్టింది. ఇక ఆ తర్వాత 2010 లో రవిబాబు దర్శకత్వంలో మనసారా చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
తెలుగుతోపాటు తమిళ్ లో కూడా పలు సినిమాలలో నటించింది. తమిళ్ లో కార్తీ, శివకార్తికేయన్, జివి ప్రకాష్ వంటి హీరోలకు జోడీగా నటించింది ఈ చిన్నది. ఈమె ఇంకెవరో కాదు.. అచ్చ తెలుగు అమ్మాయి శ్రీదివ్య. మనసారా చిత్రం తర్వాత వచ్చిన బస్ స్టాప్ సినిమాతో మొదటి కమర్షియల్ హిట్ అందుకుంది. ఆ తర్వాత శ్రీదివ్య మల్లెల తీరంలో సిరిమల్లె పూవు, వారధి, కేరింత వంటి సినిమాలలో కూడా నటించింది. తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయినా నటన పరంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది శ్రీదివ్య. ఇక కేరింత సినిమా తర్వాత శ్రీదివ్య పూర్తిగా కెరీర్ ను సక్సెస్ ట్రాక్ లో పెట్టుకోవడానికి తమిళ్ సినిమాల మీదనే దృష్టి పెట్టడం జరిగింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…