Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వారంతా ప్రభాస్ ను డార్లింగ్ అంటూ ఆత్మీయంగా పిలుస్తారు. అలాగే ఈవెంట్స్ కి వచ్చినప్పుడు తన ఫ్యాన్స్ ను డార్లింగ్స్ అంటూ సంబోధిస్తాడు. అయితే ప్రభాస్ ను అందరూ డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారు ? అంటే.. ప్రభాస్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో అందర్నీ డార్లింగ్ అని పిలుస్తుంటాడు. అది ప్రభాస్ ఊతపదంలా మారింది. ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాకు డార్లింగ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు.
ఈ సినిమాలో కూడా ప్రభాస్ ఊతపదంగా మారింది. ఆ తర్వాత వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో కూడా తన డార్లింగ్ ఊతపదాన్ని కంటిన్యూ చేశాడు. అలా ప్రభాస్ కు డార్లింగ్ అనే మాట కలిసి వచ్చింది. అయితే బుజ్జిగాడు సినిమా కంటే ముందే ప్రభాస్ తన ఫ్రెండ్స్ ని డార్లింగ్ అని పిలిచేవాడట. అలా బుజ్జిగాడు సెట్ లో డార్లింగ్ అనే పదాన్ని వాడటం, పూరీ జగన్నాథ్ క్యాచ్ చేసి సినిమాలో కూడా క్యారీ అయ్యేట్లు చూసుకున్నానని.. పూరీ జగన్నాథ్ గతంలో తెలిపారు. ప్రజంట్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం.
లేటెస్ట్ గా ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో నటించారు. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు సలార్, ఆదిపురుష్ సినిమాల్లో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ తో పాటు అర్జున్ రెడ్డి సినిమా ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి స్పిరిట్ అనే సినిమాలో నటిస్తున్నారు. అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా రాధేశ్యామ్ సినిమా నుండి క్రేజీ అప్డేట్ ని రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ హల్ చల్ చేస్తోంది. దీంతో పాటు సలార్, ఆదిపురుష్ సినిమాల నుండి ఏదైనా అప్డేట్ వస్తుందా.. అని ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…