Bahubali : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా రెండు పార్ట్‌లు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. బాహుబలి మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్‌నే చాలా మంది చూశారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఆల్ టైం అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన మూవీగా రికార్డులను సృష్టించింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలే కాకుండా.. ఇతర ఏ మూవీ కూడా బాహుబలి 2 దగ్గర దాకా రాలేకపోయాయి. అంతటి ఘన విజయాన్ని ఈ చిత్రం సొంతం చేసుకుంది.
అయితే బాహుబలి రెండు పార్ట్‌లలోనూ ప్రభాస్ మనకు ఒకసారి లావుగా.. మరొకసారి సన్నగా కనిపిస్తాడు. తండ్రి పాత్ర అయితే లావుగా.. కొడుకు పాత్ర అయితే మనకు ప్రభాస్ సన్నగా కనిపిస్తాడు. ఇక మొదటి పార్ట్ షూటింగ్ సమయంలో ప్రభాస్ 115 నుంచి 120 కిలోల వరకు బరువు ఉండగా.. రెండో పార్ట్ షూటింగ్‌కు కాస్త బరువు పెరిగాడు. ఆ సమయంలో ప్రభాస్ 140 నుంచి 150 కిలోల వరకు బరువు పెరిగాడు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో.. తండ్రి పాత్రకే ఆయన బరువు ఎక్కువగా కనిపించగా.. కొడుకు పాత్రలో బరువు తక్కువగానే కనిపించారు.
ఇక బాహుబలి మూవీ అనంతరం ప్రభాస్ చేసిన రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. సాహో, రాధే శ్యామ్ ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్నాయి. దీంతో ప్రభాస్ మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ అనంతరం రామ్ చరణ్ నటించిన ఆచార్య మూవీ సైతం ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంటుండడంతో.. రాజమౌళి గండం రిపీట్ అయిందని అంటున్నారు. అయితే మరోవైపు ఎన్‌టీఆర్ కూడా తన తదుపరి సినిమాను చేయబోతున్నాడు. మరి ఆయన అయినా ఈ గండం నుంచి బయట పడతారా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…