మన సెలబ్రిటీలు ఒక సినిమాలో నటించడానికి ఎన్ని కోట్లు తీసుకుంటారో కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. స్టార్ హీరోలందరూ కూడా తమ స్టార్ డమ్ ని బట్టి తమ రెమ్యునరేషన్ ని సెట్ చేస్తూ కోట్లు వసూలు చేస్తారు. ఇక కోట్లు వసూలు చేసే మన స్టార్ హీరోలు వారి స్టార్ డమ్ కి, అభిరుచికి తగ్గట్టు ఇళ్లను నిర్మించుకుంటారు. ఆ స్టార్ హీరోలు ఉండే ఇంటి ధర ఎంతో తెలిస్తే కచ్చితంగా మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఇలా ఖరీదైన ఇల్లు కలిగి ఉన్న స్టార్ హీరోలు ఎవరో చూద్దామా.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురం చిత్ర సమయంలో ఒక పెట్టె ఆకారంలో ఇంటిని నిర్మించుకున్నారు. అల్లు అర్జున్ ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ఇల్లు అన్ని సదుపాయాలతో కలిపి దాదాపు రూ.100 కోట్ల అయినట్లు సమాచారం. ఇక టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో భార్య నమ్రత, పిల్లలతో కలిసి రూ.28 కోట్ల విలువగల ఇంటిలో నివసిస్తున్నారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇంటి విలువ అక్షరాలా రూ.60 కోట్లు.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులందరితో కలిసి రూ.40 కోట్లు విలువ చేసే ఇంద్రభవనం లాంటి ఇంట్లో నివసిస్తున్నారు. అర్జున్ రెడ్డితో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ కూ.30 కోట్లు విలువ చేసే ఇంటిలో నివసిస్తున్నారు. కింగ్ నాగార్జున అటు చిత్రాలలోనూ, ఇటు బిజినెస్ లోనూ వేల కోట్ల ఆస్తిని సంపాదించారు. వేల కోట్ల ఆస్తి ఉన్న కింగ్ నాగార్జున రూ.40 కోట్ల విలువ చేసే ఇంద్రభవనం లాంటి ఇంటిలో నివసిస్తున్నారు.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు హైదరాబాద్ లో రెండు ఇళ్లు ఉన్నాయి. దానిలో ఒకటి మెహదీపట్నంలో ఉండగా, దాని విలువ దాదాపు రూ.30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ కి జూబ్లీహిల్స్ లో రూ.40 కోట్ల రూపాయల ఖరీదు చేసే మరో ఇల్లు కూడా ఉంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జూబ్లీహిల్స్ లో భార్య ఉపాసన గిఫ్ట్ గా ఇచ్చిన ఇల్లు ఉంది. దీని విలువ దాదాపు రూ.80 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…