వెండి తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా సమంత, నాగచైతన్య జంట ఎంతో చూడ ముచ్చటగా ఉంటుంది. ఏ మాయ చేశావె చిత్రంతో నాగ చైతన్య, సమంత ప్రేమ బంధం మొదలైంది. ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాల్లో కలిసి నటించిన ఇద్దరి జంట ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. నిజ జీవితంలో పదేళ్లు ప్రేమలో రిలేషన్ కొనసాగించి పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇంత ముచ్చటైన జంట గత ఏడాది అక్టోబర్ లో విడాకులతో వివాహ బంధానికి స్వస్తి చెప్పారు. వీరు విడిపోయి దాదాపుగా పది నెలలు గడుస్తున్నా కూడా వీరిపై ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది.
చిత్ర పరిశ్రమలో నటీనటులకు రెమ్యునరేషన్ లు భారీగా ఉంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకే కుటుంబంలో హీరో హీరోయిన్ ఉంటే వారి సంపాదన ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి వివరించనక్కర్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో వీరిపై మరో విషయం వైరల్ గా మారింది. సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత సంపాదన కూడబెట్టారనే వార్త హల్ చల్ చేస్తోంది.
నాగ చైతన్యతో ఉన్నప్పటి కన్నా సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఆఫర్ల జోరు పెరిగిందనే చెప్పవచ్చు. విడాకుల తర్వాత సమంత గ్లామర్ డోస్ ను బాగా పెంచింది. నాగచైతన్యని వివాహం చేసుకున్న తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు, టీవీ షోలు మరియు ప్రకటనల ద్వారా దాదాపు రూ.84 కోట్ల ఆదాయాన్ని సమంత కూడపెట్టిందనే సమాచారం వినిపిస్తోంది. కేవలం సినిమాలు, టీవీ షోల ద్వారానే కాకుండా సమంత సాకి అనే బ్రాండ్ కు సమంత ఓనర్ గా ఉంది. అదే విధంగా రెండు స్టార్టప్ లను కూడా ప్రారంభించి అదనపు ఆదాయాన్ని సంపాదించుకుంటోంది.
అక్కినేని వారసుడు నాగచైతన్య పుట్టుకతోనే వేలకోట్లు ఆస్తికి వారసుడు. నాగచైతన్య సమంతని పెళ్లి తర్వాత సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూ రూ.40 కోట్ల వరకు సంపాదనను వెనక వేశాడట. వీళ్లు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు దాదాపు రూ.122 కోట్ల వరకూ సంపాదించారని టాక్ వినిపిస్తోంది. సంపాదన పరంగా సక్సెస్ సాధించిన ఈ జంట నిజ జీవితంలో ఎందుకు ఫ్లాప్ అయ్యారు అనే విషయం మాత్రం అభిమానులకు ఇప్పటికి కూడా అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…