Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి.. ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ తొలిసారిగా పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్రల్లో నటించిన చిత్రం.. ఆచార్య. ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ అయింది. చాలా రోజుల తరువాత చిరంజీవి నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి. అయితే కరోనా వల్ల అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. కానీ సినిమా తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. ఇక మొత్తంగా చూస్తే ఆచార్య సినిమా థియేటర్ల నుంచి పూర్తిగా నిష్క్రమించినట్లే అనుకోవాలి. అయితే ఇప్పుడు సినిమాకు అయిన బడ్జెట్ ఎంత ? వచ్చిన మొత్తం ఎంత ? అని ప్రేక్షకులు ఆరాలు తీస్తున్నారు. ఇక ఆ విషయాలను ఒక్కసారి పరిశీలిస్తే..
ఆచార్య సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్ ఏకంగా.. రూ.140 కోట్లను ఖర్చు చేశారు. అందులో ధర్మస్థలి అనే ఊరు సెట్‌ను వేసిన విషయం విదితమే. దీన్ని హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేటలోని చిరంజీవి సొంత స్థలంలో నిర్మించారు. అయితే ఈ సెట్ కోసమే భారీగా ఖర్చు చేశారు. అందుకనే అంత బడ్జెట్ అయింది. ఇక రూ.140 కోట్లను పెట్టి సినిమాను తీసినా.. వచ్చింది రూ.48.29 కోట్లు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా కలుపుకుంటే వచ్చిన లెక్క ఇది. మొత్తం గ్రాస్ రూ.75.90 కోట్లు సాధించగా.. నెట్ రూ.48.29 కోట్లను సాధించింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.84.21 కోట్లు రావాలి. అదిప్పుడు అసాధ్యమనే చెప్పవచ్చు. దీంతో ఆచార్య మూవీకి గాను నిర్మాతలకు భారీ నష్టమే వచ్చిందని చెప్పవచ్చు.
ఇక ఇప్పటికే ఒక డిస్ట్రిబ్యూటర్ తమ నష్టాలను భరించాలని.. తమకు డబ్బు ఇవ్వాలని చిరంజీవికి లేఖ రాశారు. అయితే ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. దీంతో ఆయన వచ్చిన వెంటనే నష్టాలను అందరికీ భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఈ పనిలో ప్రస్తుతం రామ్ చరణ్ తలమునకలై ఉన్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ కానుంది. దీంతో ఆ మూవీ ద్వారా వచ్చే లాభాలను డిస్ట్రిబ్యూటర్‌లకు అందిస్తారని చరణ్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మరోవైపు కొరటాల శివ కూడా నష్టాలను కొంత వరకు భర్తీ చేస్తారని మాట ఇచ్చినట్లు సమాచారం. సినిమా ఫ్లాప్ అవడం వెనుక దర్శకుడిగా తన ఫెయిల్యూర్ కూడా ఉంది కనుక ఆయన కూడా కొంత మేర నష్టాన్ని భర్తీ చేసేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తరువాత సినిమా ఎన్‌టీఆర్‌తో చేస్తున్నారు కనుక.. అది హిట్ అయితే దాని ద్వారా వచ్చే లాభాలతో ఆయన ఆచార్య నష్టాలను భర్తీ చేస్తారని.. మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…